చలువ పానీయాలు!
ఎండలు దంచికొడుతున్నాయి. ఇల్లు దాటితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతోంది. కొంతమంది మంచం పడుతున్నారు. ఎండలో ఎకువ సమయం గడిపితే శరీర ఉష్ణోగ్రత పెరగడం, శరీరంలోని నీరు తగ్గడం జరుగుతుంది.
ఎండలు దంచికొడుతున్నాయి. ఇల్లు దాటితే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతోంది. కొంతమంది మంచం పడుతున్నారు. ఎండలో ఎకువ సమయం గడిపితే శరీర ఉష్ణోగ్రత పెరగడం, శరీరంలోని నీరు తగ్గడం జరుగుతుంది. కాబట్టి వేసవిలో ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం. అందుకే శరీర వేడిని తగ్గించడానికి, కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ముఖ్యం. ఈ ఎండల నుంచి కాపాడే ఆహారం గురించి తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు: స్వచ్ఛమైన కొబ్బరి నీరు శరీరంలో నీటి శాతాన్ని కాపాడి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. కొబ్బరిని ముఖానికి రుద్దుకుంటే చర్మానికి చల్లదనం కలుగుతుంది.
మజ్జిగ: ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈ పానీయంలో ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వేసవిలో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. మండుటెండలో మజ్జిగ తాగితే శరీరం చల్లబడటమే కాదు కడుపులోని అల్సర్ వల్ల కలిగే మంట తగ్గి హాయిగా ఉంటుంది.
కలబంద: ఇది శరీర అంతర్గత, బాహ్య వేడిని తగ్గిస్తుంది. ఈ చల్లదనాన్ని నేరుగా పొందడానికి కలబంద జెల్‌ను చర్మానికి రాసుకోవాలి. కలబంద జెల్లో నూరిన దోసకాయ గుజ్జు కలిపి లేదా కలబంద జెల్లో పుదీనా రసం కలిపి తాగాలి.
పుదీనా: పుదీనా శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరించే గుణం కలిగి ఉంది. శరీర వేడిని సమతుల్యం చేయడానికి ఆహారం, పానీయాలలో పుదీనా కలుపుకోవాలి. పెరుగు, మజ్జిగ, నిమ్మరసంలో పుదీనాను కలిపితే అదనపు లాభాలుంటాయి.
పుచ్చకాయ: పుచ్చకాయలో సాధారణంగా 92 శాతం నీరు ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ను నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
దోసకాయ: ఇందులో 95 శాతం నీటితో పాటు పీచుపదార్థం కూడా ఉంటుంది. ఇది వేసవి తాపంలో వచ్చే సాధారణ సమస్యలలో ఒకటైన మలబద్ధకం నుండి విముక్తి కలిగిస్తుంది. దోసకాయలను ముఖ, కంటి చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు.
నిమ్మకాయ: విటమిన్ సి పుషలంగా ఉండే నిమ్మకాయ, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరానికి అవసరమైన తేమ, ఆక్సిజన్‌ను అందించడం ద్వారా, వేసవిలో మీ శక్తి స్థాయులను మెరుగుపరచి, తాజాగా ఉండేలా చేస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Dehydration
- foods
- heat
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

