Banana Leaves | అరటి ఆకుల్లో భోజనం చేస్తే శరీరానికి ఎంత మేలంటే..!
అరటి ఆకుల్లో (Banana Leaves) భోజనం చేయడం భారతీయుల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆధునిక బిజీ లైఫ్‌లో అరిటాకు భోజనాలు అరుదైనా ఇప్పటికీ పల్లెల్లో, పండుగలు, శుభకార్యాల్లో అరటి ఆకుల్లో భోజనం వడ్డించడం చూస్తుంటాం.
న్యూఢిల్లీ : అరటి ఆకుల్లో (Banana Leaves) భోజనం చేయడం భారతీయుల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆధునిక బిజీ లైఫ్‌లో అరిటాకు భోజనాలు అరుదైనా ఇప్పటికీ పల్లెల్లో, పండుగలు, శుభకార్యాల్లో అరటి ఆకుల్లో భోజనం వడ్డించడం చూస్తుంటాం. అరటి ఆకును ప్లేట్లా ఉపయోగిస్తూ ఆహార పదార్ధాలను వడ్డించడం దక్షిణాసియా దేశాల్లోనూ సంప్రదాయంగా వస్తోంది. అరటి ఆకులు సహజసిద్ధమైనవే కాకుండా బయోడీగ్రేడబుల్, విస్తృతంగా అందుబాటులో ఉండటం, పర్యావరణహితమైనవి కావడంతో వీటి వాడకం మేలైనదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా అరటి ఆకులు వాటర్ ఫ్రూప్ కావడంతో వీటిలో భోజనం చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అరటి ఆకులో భోజనం చేయడం వంటకాల రుచిని, ఫ్లేవర్‌ను పెంచుతుంది. ఇక అరటి ఆకుల్లో భోజనం చేయడం ద్వారా ప్రయోజనాలను పరిశీలిస్తే అరటి ఆకులు సహజమైన డిస్ఇన్ఫెక్టెంట్గా చెబుతారు. ఇవి ఆహారంలో ఉన్న హానికారక బ్యాక్టీరియా నశించేలా చేస్తాయి.
అరటి ఆకుల్లో పాలీపెనాల్స్, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటి అత్యవసర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అరటి ఆకుపై భోజనం వడ్డించగానే ఆకులోఉండే ఈ పోషకాల్లో కొన్ని ఆహారంలోకి చేరతాయి. కొన్ని సింథటిక్ ప్లేట్లతో పోలిస్తే అరటి ఆకులు ఎలాంటి టాక్సిన్స్‌ను, హానికారక కెమికల్స్‌ను ఆహారంలోకి విడుదల చేయవు. అరటి ఆకుల్లో భోజనం చేయడం ద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అరటి ఆకుల్లో ఉండే పాలీపెనాల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరిచి పోషకాలను మెరుగ్గా గ్రహించేలా చేస్తాయి.
Read More :
Magnesium | మెగ్నీషియం లోపిస్తే శరీరంలో ఏం జరుగుతుంది..ఈ లోపానికి చెక్ పెట్టాలంటే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

