KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
KTR | ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు.
KTR | ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొండివైఖరి వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రైతుల సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు, రుణమాఫీ, రైతు బీమా అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండించి ఇతర ప్రాంతాలకు ధాన్యం సరఫరా చేశామని గుర్తుచేశారు. ఈ ఏడాది గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదుల ద్వారా భారీగా నీరు వచ్చిందని, గోదావరిలో సుమారు 750 టీఎంసీల నీరు ప్రవహించిందని చెప్పారు. ఆ నీటిని వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేశారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీటిని ఎత్తిపోసి ఉంటే ఎస్సారెస్పీతో పాటు చెరువులను నింపుకోవచ్చని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని గత జూన్ 19న కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి వివరించారని తెలిపారు. లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోందని, పంపులు నడిపి నీటిని వినియోగించుకోవాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుకు కల్పతరువుగా ఉపయోగపడుతుందని, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి రైతుల ప్రయోజనాల కోసం దాన్ని వినియోగించాలని సూచించినట్లు చెప్పారు.
శ్రీశైలం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల వద్ద పంపులు ఆన్ చేయకపోవడం వల్ల వానాకాలం పంటలకు నష్టం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. సుమారు 35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించినట్లు కేటీఆర్ తెలిపారు. లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, నాగరాజు కుటుంబాలను కలిసినట్లు చెప్పారు. సిరికొండ మండలంలో పాండురంగ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలోనూ, మంచిర్యాలలో రైతు మరణించినప్పుడు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించామని గుర్తుచేశారు.
కేసీఆర్ హయాంలో రైతు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల రైతు బీమా సాయం 15 రోజుల్లోపు కుటుంబానికి అందేదని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం రైతు బీమా ప్రీమియం కూడా చెల్లించకపోవడంతో పథకం అమలుపై ప్రభావం పడుతోందని ఆరోపించారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. తొలుత రూ.50 వేల కోట్లతో రుణమాఫీ చేయాల్సి ఉంటుందని చెప్పారని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.41 వేల కోట్లకు తగ్గించారని అన్నారు. అనంతరం క్యాబినెట్ స్థాయిలో రూ.31 వేల కోట్లు, బడ్జెట్లో రూ.26 వేల కోట్లుగా పేర్కొన్నారని విమర్శించారు. మార్చి 2026 బడ్జెట్లో రూ.20 వేల కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతోందని, మిగిలిన మొత్తంపై స్పష్టత లేదని అన్నారు.
రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రకటించిన మొత్తాలకు మధ్య వ్యత్యాసం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ.. తెలంగాణలో ఏర్పడినది ప్రకృతి కారణంగా వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Congress
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

