Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
Diwali Parole | దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన 143 మంది ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ధంతేరస్ అయిన నవంబర్ 6న వారిని విడుదల చేయనున్నది. దీంతో ఆ ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి 15 రోజులు ఉండనున్నారు. తమ వారితో కలిసి దీపావళి జరుపుకుంటారు.
గాంధీనగర్: దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన 143 మంది ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ధంతేరస్ అయిన నవంబర్ 6న వారిని విడుదల చేయనున్నది. దీంతో ఆ ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి 15 రోజులు ఉండనున్నారు. తమ వారితో కలిసి దీపావళి జరుపుకుంటారు. (Diwali Parole) ఖైదీల సంక్షేమం, జైలు సంస్కరణల కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఖైదీలు వారి కుటుంబాలతో కలిసి దీపావళి జరుపుకునే అవకాశాన్ని కల్పించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 143 మంది అర్హులైన ఖైదీలకు 15 రోజుల దీపావళి పెరోల్‌ను మంజూరు చేశారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన 103 మంది పురుషులు, 40 మంది మహిళలు ఉన్నారు. నవంబర్ 6న ధంతేరస్ రోజున వారు విడుదల కానున్నారు. 15 రోజులపాటు తమ కుటుంబాలతో కలిసి ఉండటంతో పాటు దీపావళిని జరుపుకుంటారు. ఆ తర్వాత జైళ్లకు తిరిగి చేరుకుని తమ శిక్షను కొనసాగిస్తారు.
కాగా, గుజరాత్ ప్రభుత్వం 2003 నుంచి ప్రతి సంవత్సరం అర్హులైన ఖైదీలకు దీపావళి సందర్భంగా 15 రోజుల పెరోల్‌ను మంజూరు చేస్తున్నది. అర్హులైన మహిళా ఖైదీలు, 60 ఏళ్లు పైబడిన అర్హులైన పురుషులకు ఇది లభిస్తుంది. దీని కోసం సంబంధిత నియమ నిబంధనలతో పాటు కొన్ని మార్గదర్శకాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

