Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
ProductionNo1 | సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం 'ప్రొడక్షన్ నంబర్ 1' ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోగా రాజీవ్ వర్మ, హీరోయిన్గా మలైకా టి. వాసుపాల్ నటిస్తున్నారు.
సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్ 1’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోగా రాజీవ్ వర్మ, హీరోయిన్గా మలైకా టి. వాసుపాల్ నటిస్తున్నారు. ఈ జంటపై ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ క్లాప్ కొట్టగా, నిర్మాత కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.
దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్‌ప్లేను కూడా అందిస్తున్నారు. ఈ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథా చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఆర్కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి హాయిగా ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, మిగిలిన షెడ్యూల్స్ కోనసీమ పరిసర ప్రాంతాల్లో జరుగనున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతగా కనుమూరి ప్రసాద్ రాజు వ్యవహరిస్తుండగా, ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్ కోసనం, ఎడిటర్‌గా జే.పి, కో-డైరెక్టర్‌గా శ్రీనివాస్ రాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా యర్రంశెట్టి దుర్గాప్రసాద్, కాస్ట్యూమ్స్‌గా చంద్రబోస్, పీఆర్ఓగా దుద్ది శ్రీను పనిచేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

