దేశీ పండ్లు రుచిని పంచడమే కాకుండా ఆరోగ్యానికి (Health Tips) కూడా మేలు చేస్తాయి. సీజన్లకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండు ప్రసిద్ధి కాగా వీటిలో పోషకాలూ మెండు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లలో ఫాల్సా పండ్లు ముందువరుసలో నిలుస్తాయి. ఈ పండ్లలో అనేక పోషక విలువలు ఉండటంతో ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఇండియన్ ఫర్బత్ బెర్రీగా పేరొందిన ఈ ప్రూట్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను చూద్దాం. ఫాల్సా సులభంగా జీర్ణమయ్యే అనేక విటమిన్లు, మినరల్స్‌తో కూడిన పవర్‌హౌస్‌గా చెబతారు. ఈ పండ్లు తక్కువ కాలమే తాజాగా ఉండటంతో వీటిని వెంటనే తినడం మేలు. వేసవిలో డీహైడ్రేషన్ బారినపడుకుండా ఉండేందుకు ఈ పండును తీసుకోవడం శ్రేయస్కరం.
ఫాల్సాలో నీటి శాతం అధికంగా ఉండటంతో ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు పరిమితంగా ఉండటంతో పాటు సింపుల్ షుగర్స్ ఉండటం వల్ల మధుమేహులు నిరభ్యంతరంగా ఈ పండ్లను తీసుకోవచ్చు. ఫాల్సాలో యాంటీఆక్సిటెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక కొలజెన్ కంటెంట్ ఉండటంతో చర్మ సమస్యలు నివారించి చర్మ సౌందర్యం మెరుగుపడేందుకు మేలు చేస్తుంది. ఇక ఫాల్సా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
రక్తహీనతకు చెక్
కీళ్ల నొప్పుల నివారణ
అదుపులో మధుమేహం
మలేరియా నివారణ
చర్మసౌందర్యం
Read More
Thawing | ఫ్రిజ్‌లో పెట్టిన ఏ పదార్థాన్ని అయినా బయటికి తీశాక..