e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News Diabetes | ఫాస్ట్‌ఫుడ్ తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా?

Diabetes | ఫాస్ట్‌ఫుడ్ తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా?

ఏ వ్యాధి అయినా వచ్చాక నియంత్రించడం కంటే.. రాకుండా నివారించడమే మంచి మార్గమని అంటున్నారు వైద్యులు. కరోనా నేర్పిన పాఠం వల్ల వైరస్‌ల విషయాల్లో జాగ్రత్త పడినా.. బీపీ, డయాబెటిస్‌ వంటి విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో అవి ప్రతి ఒక్కరిలోనూ చేరుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా ? ప్రధానంగా డయాబెటిస్‌ ఉన్న వారు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్‌ వెల్లిటస్‌ అని వ్యవహరిస్తారు. మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కెరస్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థితిలో ఉండడం. ఇది వ్యాధి కాదు. శరీరంలో ఇన్సులిన్‌ తగ్గడం వల్ల ఏర్పడే అసమానత. సాధారణంగా ఒక లీటరు రక్తంలో గ్లూకోజ్‌ 100 మిల్లీ గ్రాములు ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు భావించాలి. సాధారణంగా పరిగడపున రక్త, మూత్ర పరీక్షలు చేసి గ్లూకోజ్‌ స్థాయి తెలుసుకుంటారు. మధుమేహంలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. టైప్‌-1, టైప్‌-2, ఔస్టేషనల్‌.

- Advertisement -

టైప్‌-1 మధుమేహం..

క్లోమ గ్రంథిలో బీటాకణాలు నశించి ఇన్సులిన్‌ స్రవించకపోవడం వల్ల ఈ రకం మధుమేహం వస్తుంది. సాధారణంగా జన్యు కారణాల వల్ల టైప్‌ 1 మధుమేహం వస్తుంది. ఆకలి విపరీతంగా వేయడం, ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం, బలహీనత, చిరాకు, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైప్‌-2 మధుమేహం..

శరీరం సరైన స్థితిలో ఇన్సులిన్‌ను వినియోగించుకోలేనప్పుడు టైప్‌-2 మధుమేహం వస్తుంది. ఈ రకం మధుమేహం వయసు పైబడడం, ఊబకాయం, శారీరక శ్రమలేని జీవన విధానం మొదలైన వాటి వల్ల వస్తుంది. చూపు తగ్గిపోవడం, కాళ్ల తిమ్మిర్లు, మొద్దుబారినట్లు అనిపించడం, కాళ్ల మీద గాయం అయినప్పుడు త్వరగా మానకపోవడం, చర్మం మీద దురదలు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఔస్టేషనల్‌ మధుమేహం..

హర్మోన్లలో సంభవించే తేడాల వల్ల గర్భధారణ సమయంలో కొంతమందిలో వస్తుంది. ప్రసవానంతరం తగ్గిపోతుంది. అయితే ఇలా గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన వారిలో సగానికి సగం మందిలో తరువాత వయస్సులో టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆహార, వ్యాయామాల విషయంలో శ్రద్ధ వహించాలి.

మధుమేహం లక్షణాలు..

తరచుగా మూత్ర విసర్జన..: శరీంలో చక్కెర మోతాదు పెరిగిపోయినప్పుడు శరీరం కిడ్నీల ద్వారా దానిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. దాని వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

చర్మం పొడిబారిపోయి దురదలు పెట్టడం..: ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడంతో శరీరం ఎండిపోయి, చర్మం పొడిబారిపోతుంది. స్నిగ్థత కోల్పోవడం వల్ల దురదలు వస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు పెరిగి అంటువ్యాధులకు ఆస్కారం ఏర్పడుతుంది.

మధుమేహ నియంత్రణకు సూత్రాలు..

బరువును అదుపులో ఉంచుకోవాలి. ఊబకాయులు అయిన మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాలి. కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. చురుకుగా ఉంటూ రోజూ అరగంట వ్యాయామం చేస్తే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు. మానసిక ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఫాస్ట్‌ ఫుడ్‌ పూర్తిగా నియంత్రించాలి.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..

మధుమేహులు కాకరకాయలు, నేరేడుపండు, మెంతులు, దంపుడు బియ్యం, ముడి బియ్యం, ఆకుకూరలు, క్యారెట్‌ వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మామిడి పండు, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, అరటిపండు, కిస్మిస్‌, ఖర్జూరం, ఆలుగడ్డ, పాలిష్‌ చేసిన బియ్యం వంటి పదార్థాలు తీసుకోవద్దు. పాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌ వల్ల పిల్లలనూ మధుమేహం వెంటాడుతోంది.

కల్తీ ఆహరం వల్లేనే వ్యాధులు..

ఆహారాల్లో కల్తీ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు కూడా వ్యాధులు వస్తున్నాయి. ప్రతి పదార్థంలోనూ రసాయనాలే. ఎరువులు వినియోగం పెరిగి నియంత్రణలేకుండా మందులు వాడడం వల్ల కూరగాయలు కూడా విషపూరితమవుతున్నాయి. పెరటి కూరలు చాలా శ్రేయస్కరం. ప్రతి రోజు ఒకపూట పచ్చి ఆహారం తీసుకుంటే చాలా మంచిది.

-మొక్కల వెంకటయ్య, ప్రకృతి వైద్యుడు

మితాహారం తీసుకోవాలి..

వ్యాధులను అదుపు చేయాలంటే ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురావాలి. మంచి కూరగాయలు, ఆకుకూరలు ప్రతి రోజూ డైట్‌లో ఉండాలి. అప్పుడే ఎలాంటి వ్యాధులూ దరిచేరవు. మంచి విటమిన్లు ఉండే ఆహారాన్ని వదలిపెట్టి బయట దొరికే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. రెండు పూటలా వ్యాయామం చేయడం తప్పనిసరి.

-డాక్టర్‌ పుష్పలత, ఎండీ

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

పల్లెల్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ అవుతున్న డయాబెటిస్ రోగులు.. ఎందుకంటే..

Child Health | మీ పిల్లలు నులిపురుగులతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా నివారించండి

Spondylitis | సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను ఎక్కువ‌గా వేధిస్తున్న ఈ స‌మ‌స్య‌ను ఎలా జ‌యించాలి?

Food and Age : ఈ ఆహారాలు తీసుకోండి‌.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?

ఫాస్ట్‌ఫుడ్ తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా? ఫాస్ట్‌ఫుడ్ తింటే డ‌యాబెటిస్ వ‌స్తుందా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana