పల్లెల్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ అవుతున్న డయాబెటిస్ రోగులు.. ఎందుకంటే..
Diabetes | గ్రామాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో డయాబెటిక్ (షుగర్ వ్యాధి) రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం..ఇప్పుడు దీనిగురించి తెలియని వారుండరు. ఒకప్పుడు మధ్యవయస్సులో వచ్చే ఈ చక్కెర వ్యాధి..ప్రస్తుతం చిన్నతనం నుంచే వెంటాడుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో దీనిబారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో డయాబెటిక్ (షుగర్ వ్యాధి) రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, విపరీత ఒత్తిడికి గురవడం లాంటి కారణాలు కూడా మధుమేహం సోకేందుకు కారణంగా చెప్పొచ్చు. అనారోగ్యం బారిన పడి టెస్ట్‌లు చేయించుకుంటే తప్పా చాలామందికి షుగర్ ఉన్నట్లు తెలియడం లేదు. 70 నుంచి 80 శాతం మంది చివరిదశలోనే వ్యాధి ఉన్నట్లు తెలుసుకొని ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రేటర్‌లోనే మధుమేహం బాధితులు అధికంగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య సంస్థల గణాంకాల ద్వారా తెలుస్తోంది.

స్వీట్ పాయిజన్‌గా..
- వ్యాధి పేరులోనే తీపిదనం ఉంది. ఇది క్రమంగా తియ్యటి విషంలా మనిషి ప్రాణాలు తీస్తున్నదని ఉస్మానియా ఎండ్రోక్రినాలజిస్టు డాక్టర్ రాకేష్సాహె తెలిపారు. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదా శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఈ వ్యాధి బయటపడుతుంది. వైద్య పరిభాషలో దీన్ని స్వీట్ పాయిజన్ అంటారు.
- డయాబెటిస్ ప్రభావం చూపే అవయవాలు : గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కండ్లు, కీళ్లు, కండరాలు, నరాలు

వ్యాధి లక్షణాలు :
అతిగా ఆకలివేయడం
అతిగా నీరసించిపోవడం
అతి మూత్రం, అతి దాహం
బరువు తగ్గిపోవడం
గాయాలు త్వరగా మానకపోవడం
చూపు మందగించడం
జాగ్రత్తలు :
- బరువు పెరగకుండా చూసుకోవాలి.
- నిత్యం కనీసం అరగంటపాటు వ్యాయామం చేయాలి.
- ప్రతిరోజూ 3 నుంచి 5 సార్లు పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
- చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గించాలి.
- ధూమపానానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్‌ను తగ్గించాలి.
- రక్తంలో గ్లూకోజ్, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవాలి.
ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు
జీవన విధానం, మారుతున్న ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల డయాబెటిక్ వస్తుంది. చక్కెర స్థాయిలు (షుగర్ లెవల్స్) బ్యాలెన్స్‌గా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అదుపు తప్పితేనే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలామందికి ముదిరినాక వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ముందే గుర్తిస్తే క్రమంగా అదుపు చేయొచ్చు. ఇటీవల పిల్లలు కూడా డయాబెటిక్ బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం, నాలుగుగోడల మధ్యే ఉండడం, గంటల తరబడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం.
– డాక్టర్ రాకేష్ సాహె, ఎండ్రోక్రినాలజిస్టు, ఉస్మానియా దవాఖాన
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

