Health Tips | చల్లటి నీరుతో హృద్రోగులకు ముప్పు
ప్రాణాంతక గుండె పోటుతో (Health Tips) నిత్యం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కండరానికి రక్త సరఫరా తగ్గుముఖం పడితే గుండె పోటు ముప్పు పెరుగుతుంది.
న్యూఢిల్లీ : ప్రాణాంతక గుండె పోటుతో (Health Tips) నిత్యం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కండరానికి రక్త సరఫరా తగ్గుముఖం పడితే గుండె పోటు ముప్పు పెరుగుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడితే గుండె దెబ్బతినడంతో పాటు మరణం సంభవిస్తుంది. గుండె పోటుకు ముఖ్యమైన కారణాల్లో ధమనుల్లో వ్యర్ధాలు పేరుకుపోవడమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాట్, కొవ్వుల వంటి అనారోగ్య కారక వ్యర్ధాలు శరీరంలో పేరుకుపోవడంతో రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయి. ఇక చల్లటి నీరు, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన నీరు తాగితే ముఖ్యంగా హృద్రోగుల్లో గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటుచేసుకుని తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో బాధపడేవారు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే వారిలో చల్లటి నీరు శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించినా ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారిలో మాత్రం హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చల్లటి నీరును సేవించగానే ముఖ్యంగా హృద్రోగుల్లో కొద్ది క్షణాల్లోనే గుండె పోటు వంటి సీరియస్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రూమ్ టెంపరేచర్కు సరిపోయే రీతిలోనే హైడ్రేట్ కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానంతరం గోరువెచ్చటి నీరు తీసుకుంటే మేలని, అది జీర్ణక్రియకు దోహదపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రూం టెంపరేచర్తో కూడిన నీటిని తీసుకుంటే శరీరంలో కీలక అవయవాలు సజావుగా పనిచేయడంతో పాటు శరీరం అంతటికీ పోషకాలు, ఆక్సిజన్ సమకూరుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంతో పాటు గుండె కొట్టుకునే వేగం నిలకడగా ఉంటుందని వైద్య నిఫుణులు సూచిస్తుందని అన్నారు.
Read More
Neha Kamani Sundesha | ఇచ్చట గెలుపు తయార్.. పాత పద్ధతులను పక్కనబెట్టి కొత్త ఆయుధాలను ఎంచుకోండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

