Neha Kamani Sundesha | ఇచ్చట గెలుపు తయార్.. పాత పద్ధతులను పక్కనబెట్టి కొత్త ఆయుధాలను ఎంచుకోండి
కెరీర్లో నడి వయసు ఓ సంక్షోభం. ఉన్న నైపుణ్యాలు పాతబడిపోతాయి. కొత్త నైపుణ్యాలు తలకెక్కవు. అప్పుడే బరిలోకి దూకిన నవతరం తమదైన సాంకేతిక ప్రతిభతో పాతకాలపు పనితనానికి సవాలు విసురుతుంది.
కెరీర్లో నడి వయసు ఓ సంక్షోభం. ఉన్న నైపుణ్యాలు పాతబడిపోతాయి. కొత్త నైపుణ్యాలు తలకెక్కవు. అప్పుడే బరిలోకి దూకిన నవతరం తమదైన సాంకేతిక ప్రతిభతో పాతకాలపు పనితనానికి సవాలు విసురుతుంది. ఈ సమయంలో ఫార్టీ ప్లస్ ఉద్యోగికి చదువు, కెరీర్, లైఫ్ కౌన్సెలింగ్.. ఈ మూడూ అవసరం అవుతాయి. నేహా కామని నేతృత్వంలోని ‘సెవెన్ హ్యాట్స్’ ఈ బాధ్యత తీసుకున్నది. ఇప్పటికే ఆమె అనేకమందిని కెరీర్ సంక్షోభం నుంచి ఒడ్డునపడేసింది. అదే సమయంలో కళాశాల విద్యార్థులకు జీవితం పట్ల స్పష్టతనిస్తూ శిక్షణ తరగతులు తీసుకుంటున్నది. ‘పాతబడిన పనిముట్లను అటకెక్కించండి. పాత పద్ధతులను పక్కన పెట్టండి. కొత్త ఆయుధాలను ఎంచుకోండి’ అంటారామె.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదివింది నేహ. మీ లక్ష్యం ఏమిటన్నది చెబితే చాలు.. దాన్ని చేరుకునే మార్గం బోధిస్తుంది. మీ కల ఏమిటన్నది వివరిస్తే చాలు.. దాన్ని నిజం చేసుకునే మార్గాలు చూపుతుంది. ‘మా శిక్షణ ఫలితంగా నచ్చిన కాలేజీలలో సీటు తెచ్చుకున్నవారు, కోరిన కొలువులలో విజయాలు సాధిస్తున్నవారు ఎంతోమంది’ అని గర్వంగా ప్రకటిస్తుంది నేహ. విజయానికి దగ్గరి మార్గాలు లేకపోవచ్చు. కానీ సుదూర ప్రయాణమూ మంచిది కాదు. దీనివల్ల అలసిపోతాం. వెనుకబడిపోతాం. అదే, చేతిలో ఓ దిక్సూచి ఉంటే.. ఇబ్బంది ఉండదు. నేరుగా చేరాల్సిన చోటికి, చేరాల్సిన సమయానికే చేరుతాం. అలాంటి ఓ పనిముట్టే ‘సెవెన్ హ్యాట్స్’.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

