న్యూఢిల్లీ : శీతాకాలం వచ్చీరాగానే అప్పుడే చలి పులి పంజా (Diet Tips) విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం వణకుతున్న పరిస్ధితి. మరోవైపు శీతల గాలులకు తోడు పర్యావరణ కాలుష్యం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీపావళి నాటికి కాలుష్యం మరింత పొగబారే క్రమంలో శ్వాసకోశ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. శ్వాసపై ధ్యాస నిలిపే ప్రాణామాయం, యోగాసనాలతో పాటు వింటర్లో ఆరోగ్యానికి ముఖ్యంగా లంగ్స్‌ను కాపాడుకునేందుకు నిర్ధిష్ట ఆహార పదార్ధాలను తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో పండుగలను పూర్తిగా ఆస్వాదిస్తూనే ఊపిరితిత్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మన శ్వాసకోశ ఆరోగ్యం సజావుగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సమతులాహారంతో పాటు విటమిన్లతో కూడిన యాంటీఆక్సిడెంట్స్‌తో కూడిన ఆహారం నిత్యం తీసుకోవాలి, విటమిన్ సీ, ఈతో కూడిన ఆహారాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధుల ముప్పును నివారించవచ్చు. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం మానుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో లంగ్స్‌ను పదిలంగా ఉంచుకునేందుకు ఈ డైట్ టిప్స్ పాటించాలి.
తగినంత నీరు తీసుకోవాలి
యాంటీఆక్సిడెంట్స్
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు
స్పైసెస్
ఫైబర్ రిచ్ ఫుడ్
షుగర్ డ్రింక్స్‌కు చెక్
ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరం
పాల పదార్ధాలకు దూరం
కెఫిన్, ఆల్కహాల్, స్మోకింగ్‌కు చెక్
Read More :