Satilite Internet | శాటిలైట్ ఇంటర్నెట్పై పట్టుకు యత్నాలు.. నువ్వా? నేనా అంటున్న జియో ఎయిర్టెల్
Satilite Internet | జియో స్పేస్ ఫైబర్ సర్వీసును తక్కువ అంచనా వేయొద్దని భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ను హెచ్చరించారు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్.
Satilite Internet | దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో.. శుక్రవారం `జియో స్పేస్ ఫైబర్ సర్వీస్` ప్రారంభించింది. ఇది ఒక జీబీపీఎస్ సామర్థ్యం గల బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ అందిస్తుంది. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వేగంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యం. ఈ దశలో భారతీ ఎయిర్‌టెల్‌కు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటిదాక టెలికం రంగంలో పోటీ కొనసాగింది. ఇక శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోనూ మొదలైందా.. జియో, ఎయిర్టెల్ పోటీ పడబోతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్‌తో జత కట్టిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్.. వచ్చే ఐదారేండ్లలో ఎలన్‌మస్క్ స్టార్‌లింక్, అమెజాన్ కూపియర్ మాత్రమే శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవల్లో తమ వన్‌వెబ్‌కు పోటీ ఇస్తాయని వ్యాఖ్యానించారు. సునీల్ మిట్టల్ వ్యాఖ్యల నేపథ్యంలో `మమ్ముల్ని తక్కువ అంచనా వేయొద్దు` అంటూ రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ హెచ్చరించడం గమనార్హం. భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు ఇతర సంస్థలను తక్కువ అంచనా వేయబోమన్నారు. కానీ సమీప భవిష్యత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో ఇతర సంస్థలు తమకు పోటీ ఇవ్వలేరని పేర్కొన్నారు.
భారతీ ఎయిర్టెల్ జత కట్టిన వన్‌వెబ్, రిలయన్స్ జియోతోపాటు భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలన్‌మస్క్ స్టార్‌లింక్, అమెజాన్ కూపియర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సునీల్ మిట్టల్ తెలిపారు. కానీ, భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది.
మరోవైపు, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లగ్జెంబర్గ్ కేంద్రంగా పని చేస్తున్న శాటిలైట్ ప్రొవైడర్ ఎస్ఈఎస్తో రిలయన్స్ జియో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. తమ జాయింట్ వెంచర్‌కు స్పెక్ట్రం కేటాయించిన వెంటనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ పేర్కొన్నారు. గిగాబైట్ సామర్థ్యం గల ఎన్జీఎస్ఓ సేవలు అందించగల తమను ఇతర సంస్థలు ఇప్పట్లో ఢీకొట్టలేవని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

