హైదరాబాద్: డయాబెటిక్ పేషెంట్లు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి హాని కలుగజేయవు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు విషయంలో కూడా షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు భయపడుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
గుడ్లు తినని వారికంటే గుడ్లు తినే వారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉన్నదని ఆ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనకారులు తెలిపారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఆ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిక్, టైప్-2 డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.
పరిశోధనలో పాల్గొన్నవాలెంటీర్లను మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో గరిష్టంగా వారానికి 12 గుడ్లు.. కనిష్టంగా ఒక గుడ్డు చొప్పున ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందించారు. ఆ తర్వాత చివరిగా అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో గుడ్లు ఎక్కువగా తిన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనపించలేదట. దాంతో గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఆ టాయిలెట్స్ వినియోగిస్తే మనకే డబ్బులిస్తారట..!
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!