TGSRTC Strike | లేబర్ కమిషన్ సమ్మె చర్చలకు ఆర్టీసీ యాజమాన్యం మరోసారి డుమ్మా కొట్టింది. ఈ నేపథ్యంలో ఇకపై తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 22 నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు.
ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సమ్మె చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. మార్చి 13న ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు రాకపోవడంతో సమ్మె చేయాలని నిర్ణయం కార్మికులు తీసుకున్నారు.
Jadcherla | పది రోజులుగా నీళ్లు బంద్..ఖాళీ బిందెలతోజడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట ధర్నా
UK Migrant Rules | పదేళ్ల ఆవాసం తర్వాతే యూకేలో శాశ్వత నివాసం.. నిబంధనలు కఠినతరం..!