కట్టంగూర్, ఏప్రిల్ 13 : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలమ్మగూడె, పిట్టంపల్లి, భాస్కర్లబాయి, గ్రామంలో (అరైవ్-అలైవ్) కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై యువత, డ్రైవర్లు, గ్రామస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
రాంగ్ రూట్లో ప్రయాణించడం ప్రాణాంతకమని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ పుష్పలత, ఎంఈఓ అంబటి అంజయ్య, స్థానిక సర్పంచ్ సుంకరబోయిన సంధ్యా వెంకన్న, ఏఎస్ఐ నాయిని శ్రీనివాస్, వంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.