RR vs SRH | టాస్ గెలిచిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ బ్యాటర్లు దంచేస్తారా..!
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో బౌలర్ల వైఫల్యంతో ఓటముల పాలవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో (SRH) విజయంపై కన్నేసింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు.
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో బౌలర్ల వైఫల్యంతో ఓటముల పాలవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో (SRH) విజయంపై కన్నేసింది. వరసగా రెండు పరాజయాలకు చెక్ పెట్టాలనే కసితో ఉన్న ఇషాన్ కిషన్ బృందం టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు.
వైల్డ్ ఫైర్ ఆటతో పంతొమ్మిదో సీజన్లో దూసుకెళ్లాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. నాలుగింట మూడు ఓటములతో నిరాశపరిచిన హైదరాబాద్ సొంత గడ్డపై విజయంతో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది.
🚨Toss update from Hyderabad🚨@rajasthanroyals have won the toss and elected to field first against @SunRisers
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/s1QTySIOh6
— IndianPremierLeague (@IPL) April 13, 2026
మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్ మెరుపులు.. బర్గర్, ఆర్చర్, రవి బిష్ణోయ్ విజృంభణతో వరుసగా నాలుగు విజయాలతో టాప్‌లో ఉన్న రాజస్థాన్ గెలుపుపై ధీమాతో ఉంది. రికార్డులను గమనిస్తే రాజస్థాన్‌పై ఆరెంజ్ ఆర్మీదే పైచేయి. ఇరుజట్లు 21 సార్లు తలపడగా హైదరాబాద్ ఏకంగా 12 దఫాలు విజయం సాధించింది. రాజస్థాన్ మాత్రం 9 సార్లే గెలుపొందింది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్, వికెట్ కీపర్), క్లాసెన్, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ – స్మరన్ రవిచంద్రన్, షకీబ్ హుస్సేన్, లివింగ్‌స్టోన్, శివం మావి, హర్షల్ పటేల్.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), ప్రిటోరియస్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
ఇంప్యాక్ట్ సబ్స్ – వైభవ్ సూర్యవంశీ, హెట్‌మైర్, రవి సింగ్, శుభమ్ దూబే, బ్రిజేష్ శర్మ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

