నిడమనూరు, ఏప్రిల్ 13 : నిడమనూరు మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో సోమవారం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మద్దతు ధర లభిస్తుందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఐకెపి కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ ముని కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ ఐతగోని మధు, నాయకులు ముంగి శివమారయ్య, సురుగురు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, సీసీ సైదులు, మాతంగి పవన్ కళ్యాణ్, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎర్రబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం