Inter Student | 440కి 434 మార్కులొస్తే నువ్వేమైనా గొప్పోడివా.. లెక్చరర్ అవమానంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!
Inter Student | ఇంటర్ ఫస్టియర్‌లో 440కి 434 మార్కులొచ్చాయి.. అయినా సరే మెచ్చుకోవాల్సిన లెక్చరర్.. తనకంటే ఒక మార్కు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో పోలుస్తూ తీవ్రంగా అవమానించింది.
Inter Student | ఇంటర్ ఫస్టియర్‌లో 440కి 434 మార్కులొచ్చాయి.. అయినా సరే మెచ్చుకోవాల్సిన లెక్చరర్.. తనకంటే ఒక మార్కు ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో పోలుస్తూ తీవ్రంగా అవమానించింది. అందరిముందు చెంపదెబ్బకొట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గద్వాల జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గద్వాల రూరల్ కొత్తపల్లికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) గద్వాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ సెకండియర్ చదువుతున్నాడు. ఫస్టియర్ ఫలితాల్లో జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచాడు. అయితే శనివారం నాడు తరుణ్‌ను మహిళా లెక్చరర్ తీవ్రంగా అవమానించింది. 435 మార్కులు వచ్చిన మొదటి ర్యాంకర్‌తో పోలుస్తూ తిట్టింది. అలా అవమానపరచడం కరెక్ట్ కాదని లెక్చరర్‌ను తరుణ్ విజ్ఞప్తి చేశాడు. దీనికి లెక్చరర్ మరింత రెచ్చిపోయింది.
నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై లెక్చరర్ కొట్టింది. అది చూసి క్లాస్‌లోని విద్యార్థులంతా నవ్వారు. దాన్ని అవమానంగా భావించి తరుణ్ తీవ్ర మనస్తాపానికి చెందాడు. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ వీరన్న సోమవారం నాడు తరుణ్‌ను బాధపడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాడు. ఇక మంగళవారం నాడు తరుణ్ కాలేజీకి రాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానంపై తరుణ్ సూసైడ్ నోట్ రాశాడు.
ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ అవమానించకూడదు, ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆమెకు తెలియాలి అంటూ తరుణ్ ఆ సూసైడ్ నోట్లో రాశాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఇది ప్రజలందరికీ తెలియాలనే ఇలా చేస్తున్నానంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

