న్యూఢిల్లీ : ప్రొటీన్ అనగానే (Health Tips) మాంసాహారం తర్వాత ముందుగా గుర్తుకువచ్చేవి పప్పు ధాన్యాలు. పలు పప్పుధాన్యాలు మనకు లభిస్తుండగా వీటితో సంప్రదాయ వంటకాలు రుచితో పాటు శరీరానికి అవసరమైన శక్తినీ, ఉత్తేజాన్నీ అందిస్తాయి. శనగపప్పు, మినపపప్పు, కందిపప్పు వంటి ఎన్నో పప్పుధాన్యాలతో లంచ్, డిన్నర్ కోసం టేస్టీ రెసీపీలను చేసుకోవచ్చు.
రైస్, రోటీలు. పరోటాలు, పూరీలతో లంచ్, డిన్నర్ ముగించినా పప్పుధాన్యాలను వాడుతూ ఎన్నో బ్రేక్‌ఫాస్ట్ వెరైటీలనూ ఆస్వాదించవచ్చు. ప్రొటీన్ అధికంగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరం.
డైట్ పాటించని వారికి సైతం ప్రొటీన్ ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రొటీన్‌తో పాటు పప్పుధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇది సంపూర్ణ ఆహారంగా చెబుతుంటారు. ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే పప్పుధాన్యాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యకరమని న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు. ఇక బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్సగా గ్రెయిన్స్‌తో తయారుచేసిన ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
చనా దాల్ ధోక్లా
మూంగ్ దాల్ (పెసలు) టోస్ట్
గ్రీన్ మూంగ్ కట్లెట్
మసూర్ దాల్ దోశ
మినప అప్పాలు
Read More :
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?