ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది. ఆహారాన్ని జాగ్రత్తగా నిల్వ ఉంచకపోవడం, వండకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కలుషిత ఆహారం, పానీయాల వల్ల ఓ మోస్తరు కడుపునొప్పి, అతిసారం, ఇతర పొట్ట సమస్యలు దాపురిస్తాయి. కిడ్నీ వైఫల్యం, ఇతర ప్రాణాంతకమైన పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు. కాబట్టి, ఆహార పదార్థాలు వండటం, నిల్వ ఉంచడం, తినే విధానం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.