Health Tips | వర్షాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించినా.. అనేక వ్యాధులను తీసుకువస్తుంది. వాస్తవానికి, వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్లు. దాంతో వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఏ పండ్లు తినకూడదో తెలుసుకోవడం ఉత్తమం.
పుచ్చకాయ : వర్షాకాలంలో పొరపాటున కూడా పుచ్చకాయ తినకూడదు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో పుచ్చకాయ తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది. వర్షాకాలంలో పుచ్చకాయ త్వరగా చెడిపోతుంది. దాంతో పుచ్చకాయను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
స్ట్రాబెర్రీలు : వాస్తవానికి, స్ట్రాబెర్రీ పై పొరలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దాంతో స్ట్రాబెర్రీలలో కీటకాలు సులభంగా కనిపించవు. వర్షాకాలంలో స్ట్రాబెర్రీలను దూరంగా పెట్టాలి. ఎందుకంటే స్ట్రాబెర్రీలను తినడం జీర్ణవ్యవస్థకు హాని జరుగుతుంది.
ద్రాక్షలు : వర్షాకాలంలో ద్రాక్షలను కూడా తినకూడదు. ద్రాక్ష బయటి పొరలో ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దీని కారణంగా కడుపు వికారంగా ఉంటుంది.
పీచ్ : వఏసవి, వర్షాకాలంలో పీచ్ పండ్లు విరివిగా లభిస్తాయి. ఈ పండు చాలా మృదువుగా ఉంటుంది. దాంతో పండులో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ క్రమంలో ఈ పండ్లను తింటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
వర్షాకాలంలో మీరు ఆపిల్, నేరేడు పండ్లను తినొచ్చు. ఈ సీజన్లో ఆపిల్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లను తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దానిమ్మ పండ్లను తినడం కూడా మంచిదే. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటివి రాకుండా చేస్తాయి. ఇంకా అరటి, లిట్చీ వంటి పండ్లను కూడా తీసుకోవచ్చు.