Health tips | నారింజ పండు తొక్కతో ఇన్ని లాభాలున్నాయా..? ఈ విషయాలు తెలిస్తే అస్సలు పడేయరు!
Health tips | నారింజ పండ్లలో ఉండే విటమిన్ సీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. దాంతోపాటు అనేక పోషకాలు మనకు నారింజ పండ్లను తినడం వల్ల అందుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, ఆ పండ్లకు చెందిన తొక్కలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నారింజ పండు తొక్కను గాయాలు, ఇన్ఫెక్షన్కు గురైన శరీర భాగాలపై రాయాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి. నారింజ పండు తొక్కలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్లే గాయాలు, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
2. క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు నారింజ పండు తొక్కలో ఉంటాయి. శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఆ తొక్కలోని పాలీమిథాక్సీఫ్లేవోన్స్ అనబడే ఫ్లేవనాయిడ్లలో ఉంటాయి. అందువల్ల నారింజ పండు తొక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
3. నారింజ పండు తొక్కలో 61 నుంచి 69 శాతం వరకు ఫైబర్ ఉంటుంది. అందులో 19 నుంచి 22 శాతం వరకు సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది.
4. నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు, అల్జీమర్స్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
5. మొటిమల సమస్య ఉన్నవారు వాటిపై నారింజ పండు తొక్కలను నిత్యం మర్దనా చేస్తుంటే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
ఇవి కూడా చదవండి..
Health tips | అల్సర్ లక్షణాలివే.. ఈ చిట్కాలు పాటిస్తే దీన్నుంచి బయటపడొచ్చు!
PCOD | స్త్రీలలో అవాంఛిత రోమాలా? అయితే, ఈ వ్యాధిగా అనుమానించాల్సిందే..!
Menstrual Disorders | పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదా? ఈ ఇబ్బంది అధిగమించాలంటే ఏ రోజు ఏం చేయాలంటే..
Pimples | మొటిమలు రాకుండా చేసుకోవడం ఈజీ.. ఎలాగంటే..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

