Pimples | మొటిమలు రాకుండా చేసుకోవడం ఈజీ.. ఎలాగంటే..?
Pimples | కాంతివంతంగా ఉండే ముఖంపై మొటిమలు వస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలని హైరానా పడిపోతున్నారు. అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే మొటిమల సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా...
Pimples | అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కొరుకుంటుంటారు. ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిలు అందాన్ని కాపాడుకునేందుకు తెగ తాపత్రయపడుతుంటారు. అయితే, యుక్త వయసులో వచ్చే మొటిమలతో వారు అందాన్ని కోల్పోతూ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. పరీక్షలంటే భయపడటం లేదు గానీ మొటిమలంటే తెగ భయపడిపోతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న వివిధ ఫేస్ క్రీములు, ఫేస్ ప్యాకులను ఉపయోగిస్తూ వాటిలోని రసాయనాల కారణంగా మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాంతివంతంగా ఉండే ముఖంపై మొటిమలు వస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలని హైరానా పడిపోతున్నారు. అలాంటి వారు కొన్ని టిప్స్ ఫాలో అయితే మొటిమల సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఎందుకొస్తాయంటే..
- వయసుతో పాటు హార్మోన్ల ప్రభావం వల్ల వచ్చే మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
- ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్తో పాటు మారుతున్న జీవనశైలి కూడా మొటిమలు రావడానికి కారణంగా చెప్తుంటారు.
- మొబైల్ ఫోన్‌ను చెంపకు ఆనించి మాట్లాడటం వలన ఫోన్‌పై ఉండే బ్యాక్టీరియా ముఖ చర్మంపైకి చేరి మొటిమలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
- విటమిన్ డీ లోపం ఉన్నా కూడా మొటిమలు వస్తుంటాయి.
- కాఫీ తాగేవారిలో మొటిమలు త్వరగా వస్తాయి. అందుకని గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.
- వాడే కొన్ని రకాల క్రీమ్స్‌తో చర్మంపై జిడ్డును పెంచి మొటిమలు వచ్చేందుకు కారణమవుతాయి.
- ముఖంపై చర్మాన్ని బలంగా రుద్దడం వల్ల కూడా మొటిమలు వస్తాయని నిపుణులు సెలవిస్తున్నారు.
రాకుండా ఉండాలంటే..
- రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
- జిడ్డు చర్మం ఉన్న వారు ఎక్కువ సార్లు శుభ్రంచేసుకోవాలి.
- రాత్రి పడుకునేముంది మేకప్ పూర్తిగా తొలగించాలి
- మేకప్‌ను తొలగించేందుకు అల్కహాల్ లేని రిమూవరన్ని వాడాలి. తర్వాత డీప్ పూర్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి.
- ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి.
- జంక్ ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండాలి.
- వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
- ప్రతిరోజు యోగా, ధ్యానం చేయాలి.
- ముఖాన్ని శుభ్రపరిచేందుకు సబ్బు వాడొద్దు.
- బయటకు వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాయాలి.
- వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నివారించుకోవచ్చు.
ఆహారాలు ఏం తినాలంటే..
- బచ్చలి కూర, పాలకూర వంటివి నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- క్యారెట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండి మొటిమలు రాకుండా కాపాడుతుంది.
- సాల్మన్ చేపల్లో ఓమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి మొటిమలను నివారిస్తాయి.
వీటితోపాటు..
- ముఖానికి ఐస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.
- ముఖానికి పసుపును రాయడం వల్ల మొటిమలను నివారించవచ్చు.
- శనగపిండిలో నిమ్మరసం వేసి ముఖానికి పట్టించి మొటిమలను తగ్గించుకోవచ్చు.
- మొటిమలు ఉన్న ప్రాంతంలో రాత్రి పడుకునే సమయంలో వెల్లుల్లిని చిదిమి రాయడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది.
- ఆపిల్ ముక్కను ముఖంపై రుద్దడం వల్ల జిడ్డు తొలిగి మొటిమలు రాకుండా ఉంటాయి.
- పల్లి నూనె, నిమ్మరసం సమ పాళ్లలో తీసుకుని కలపి ముఖానికి అప్లై చేయడం ద్వారా మొటిమలను దూరం చేసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

