Health tips | అల్సర్ లక్షణాలివే.. ఈ చిట్కాలు పాటిస్తే దీన్నుంచి బయటపడొచ్చు!
జీర్ణవ్యవస్థలోని పెద్దపేగు లోపలి వైపు వాపు వచ్చినా, మ్యూకస్ పొర దెబ్బ తిన్నా అల్సరేటివ్ కొలైటిస్ వస్తుంటుంది. ఆరంభంలో దీని లక్షణాలు కనిపించకపోయినా వ్యాధి క్రమంగా ముదిరేకొద్దీ లక్షణాలు క్రమేపీ బయటపడతాయి. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, అలసట, జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత, ఆకలి లేకపోవడం, రక్తంతో కూడిన విరేచనాలు, లివర్ సమస్యలు, డీ హైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి కచ్చితంగా ఎందుకు వస్తుందో ఇప్పటికీ సైంటిస్టులు తేల్చలేకపోతున్నారు.
కానీ ఈ వ్యాధి జన్యు పరంగా లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావం, జీవనశైలిలో లోపాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చిన వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ కచ్చితమైన డైట్ పాటించాలి. అలాగే కింద తెలిపిన పలు సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
ఈ పదార్థాలు తీసుకోవద్దు..
టీ, కాఫీ, ఆల్కహాల్‌లకు బదులుగా గ్రీన్ టీ లేదా తులసి టీ తాగితే అల్సరేటివ్ కొలైటిస్ నుంచి బయట పడవచ్చు. పొగతాగడం, పొగాకు నమలడం కూడా మానేయాలి. లేదంటే వ్యాధి మరింత తీవ్రతరమవుతుంది. ఇక కారం, మసాలాలు దట్టించిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. పుల్లని పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోరాదు. ఇవి జీర్ణమయ్యేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది.
కారానికి దూరంగా ఉండాల్సిందే..
కారంతో చేసిన కూరలు కాకుండా.. ఉడకబెట్టిన కూరగాయలను తినడం అలవాటు చేసుకోవాలి. పాలకూర, బీరకాయ, ఆనపకాయ తదితర కూరగాయలను ఉడికించి తినాలి. ఇక ముల్లంగి, కీరదోస, పుచ్చకాయ, చింతపండు తినడం మానేయాలి. అలాగే పచ్చి కూరగాయలు కూడా తినకూడదు.
పాలకు బదులు ఇవి బెటర్..
చేపలు, మటన్ కాకుండా కోడిగుడ్లు, సోయా, పల్లీలు తదితర ఆహారాలను తీసుకోవాలి.అలాగే పాలు, పెరుగు, చీజ్, స్వీట్లు తదితర ఆహారాలను పూర్తిగా మానేయాలి లేదా తినడం తగ్గించాలి. పాలను కచ్చితంగా తాగాలనుకునేవారు అందుకు బదులుగా బాదంపాలు, సోయా పాలు, సోయా చీజ్, మేక పాలు, కొబ్బరి పాలు తాగవచ్చు.
నూనె పదార్థాలు మానేయాల్సిందే..
రాత్రి పూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే రోజుకు 3 సార్లకు బదులుగా 5 లేదా 6 సార్లు తక్కువ మోతాదులో భోజనం చేయాలి. దీంతో జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే వేపుళ్లు, నూనె పదార్థాలను మానేయాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేస్తే మంచిది. ఇక మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక కప్పు దానిమ్మ పండ్ల జ్యూస్ తాగితే మంచిది.
ఎక్కువ నీరు తాగాలి..
అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నవారు డీహైడ్రేషన్‌కు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకని వారు నిత్యం నీటిని బాగా తాగాలి. మరిగించి వడబోసిన నీటిని తాగితే ఇంకా మంచిది. అలాగే శరీరంపై చల్లని ప్రభావం చూపే బొప్పాయి, ద్రాక్ష, ఆపిల్, నారింజ, అరటిపండ్లు తదితర పండ్లను తీసుకోవాలి. దీంతో అల్సర్లు త్వరగా తగ్గుతాయి.
వీటిని ఎక్కువగా తీసుకోవాలి..
అధికంగా ఫైబర్ ఉండే ఆహారాలను తినరాదు. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే శీతలపానీయాలను కూడా తాగరాదు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే క్యారెట్లు, అవిసెగింజెలు, పుట్టగొడుగులు, పొద్దు తిరుగుడు విత్తనాలు, తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అల్సర్ నుంచి విముక్తి పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

