న్యూఢిల్లీ : చలికాలంలో శరీరంలో సహజంగా జీవక్రియలు వేగవంతమవడంతో (Health Tips) అధిక క్యాలరీలు కరిగించి బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన సీజన్‌గా చెబుతుంటారు. వేసవిలో కొద్దిగా కష్టపడితే చెమటలు కక్కే పరిస్ధితి కాగా, అందుకు భిన్నంగా చలికాలంలో వ్యాయామానికి అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
దీంతో బరువు తగ్గాలనుకునే వారు ఈ సీజన్లో ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక చలికాలంలో వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవడం మేలు.
యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే పండ్లు చలికాలంలో తలెత్తే పలు అస్వస్ధతలనూ దరిచేరనీయవు. వింటర్లో యాపిల్స్, బెర్రీస్ వంటి పోషకాలతో కూడిన పండ్లను తీసుకోవాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నీతి శర్మ వివరిస్తున్నారు. ఇంకా చలికాలంలో ఏయే పండ్లు ఆరోగ్యానికి మంచిదో ఆమె వెల్లడించారు.
యాపిల్స్
బెర్రీస్
పియర్స్
ద్రాక్ష
ఆరంజ్
కివీ
దానిమ్మ
జామ
స్టార్ ఫ్రూట్
Read More :