Luke Coutinho | ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా.. ఈయన చెప్పింది చేయాల్సిందే!!
Luke Coutinho | ఆరోగ్యంతోనే ఆకర్షణ. పోషకాలతోనే ఉత్సాహం. జీవనశైలితోనే నిత్య యవ్వనం. సినిమా తారలకు అవసరమైన అర్హతలే ఇవన్నీ. అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆకర్షణను నిలబెట్టుకోవడంలో ఫిల్మ్స్టార్స్కు తనవంతు సాయం చేస్తాడు ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ ఎక్స్పర్ట్ కాటిన్హో. మందూమాకులతో పనిలేకుండా, స్టెరాయిడ్స్ అవసరమే రాకుండా.. సినిమాలో పాత్రకు తగినట్టు హీరో, హీరోయిన్ శరీరాకృతిని తీర్చిదిద్దడమే తన బాధ్యత.
Luke Coutinho | ఆరోగ్యంతోనే ఆకర్షణ. పోషకాలతోనే ఉత్సాహం. జీవనశైలితోనే నిత్య యవ్వనం. సినిమా తారలకు అవసరమైన అర్హతలే ఇవన్నీ. అందాన్ని, ఆరోగ్యాన్ని, ఆకర్షణను నిలబెట్టుకోవడంలో ఫిల్మ్స్టార్స్కు తనవంతు సాయం చేస్తాడు ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ ఎక్స్పర్ట్ కాటిన్హో. మందూమాకులతో పనిలేకుండా, స్టెరాయిడ్స్ అవసరమే రాకుండా.. సినిమాలో పాత్రకు తగినట్టు హీరో, హీరోయిన్ శరీరాకృతిని తీర్చిదిద్దడమే తన బాధ్యత.
సీన్.. ఒకటి
‘ఈ సినిమాలో మీది మిడిల్ ఏజ్ క్యారెక్టర్ బాబూ! ఇంకో పది కిలోలు పెరిగితే పర్ఫెక్ట్. షూటింగ్ స్టార్ట్ కావడానికి రెండు నెలల సమయమే ఉంది’ డైరెక్టర్ నసుగుతాడు.
తప్పుతుందా… హీరోగారికి? ‘ఓ ఎస్. అలాగే చేద్దాం’ మాటిచ్చేస్తాడు.
అంతటి కథానాయకుడు అంత వేగంగా ఒప్పుకొనేసరికి డైరెక్టర్ ఆనందభరితుడు అవుతాడు. ‘మన సినిమా మరో మాయాబజార్. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు నాన్ డిటెయిల్డ్ పాఠంగా నిలబడుతుంది’ అంటూ పులకరించిపోతాడు.
కానీ, అంత వేగంగా బరువు పెరగడం ఎలా?
సీన్.. రెండు
‘మన మూవీలో మీరు కాలేజ్ స్టూడెంట్ బాబూ! కొత్తమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నాం. పందొమ్మిదేండ్ల టీనేజ్ గాళ్. మీరు పది కిలోలు తగ్గితే కానీ.. స్టూడెంట్ లుక్ రాదని ప్రొడ్యూసర్ అంటున్నారు. మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలియక..’ డైరెక్టర్ నీళ్లు నములుతుండగానే కథానాయకుడు కరిగిపోయి కమిట్మెంట్ ఇచ్చేస్తాడు.
‘నెల రోజుల్లో కొత్తలుక్‌తో షూటింగ్‌కు వచ్చేస్తాగా..’ హీరోగారి ఉత్సాహం చూసి ప్రొడ్యూసర్ పొంగిపోతాడు. ‘మన మూవీ పాన్ ఇండియాలో పండగ చేసుకుంటుంది బాబూ. ఇది నా వాగ్దానం. అప్పటివరకూ గడ్డం తీయను. తల దువ్వుకోను. ఈ జీన్స్ ప్యాంట్ మార్చబోను’ అంటూ భీష్మ ప్రతిజ్ఞలు చేసేస్తాడు.
అయితే, ఆ స్పీడులో బరువు తగ్గడం ఎలా?
సీన్.. మూడు
‘బాబూ! ఓ బ్రహ్మాండమైన స్టోరీతో వచ్చాను. తమిళ డైరెక్టర్. మలయాళ కొరియోగ్రాఫర్. ముంబై హీరోయిన్. లండన్ లొకేషన్. హాలీవుడ్ స్టంట్ మాస్టర్. కోట్లు కుమ్మరిస్తానంటున్నాడు కలకత్తా ప్రొడ్యూసర్. కానీ ఒకటే సమస్య. హీరోకు సిక్స్‌ప్యాక్ ఉండాల్సిందే. కానీ తమరు కాస్త బొద్దుగా…! కొంత వర్కవుట్ చేస్తే.. ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుంది. ఎలాగోలా..’ ఇండస్ట్రీ మిత్రుడు బలవంతపెడతాడు. అవుననలేని పరిస్థితి. కాదనలేని మొహమాటం. బ్లాంక్ చెక్ ముందుపెట్టేసరికి బాబు పెన్ను సంతకానికి సిద్ధమైంది. మనలో మాట, సిక్స్ ప్యాక్ కుదుర్తుందా?
ఎవరైనా సరే.. అమాంతం బరువు పెరగడం, హఠాత్తుగా బరువు తగ్గడం, వాయువేగంతో సిక్స్ ప్యాక్ సాధించడం.. అసాధ్యం. కొన్నిసార్లు సాధ్యమే అయినా ఆరోగ్యానికి ప్రమాదకరం. సరిగ్గా అప్పుడే, లూక్ కాటిన్హో రంగంలో దిగుతాడు. ఇతను ఇంటిగ్రేటివ్ లైఫ్‌ైస్టెల్ ఎక్స్పర్ట్. గోవాలో పుట్టాడు. ప్రపంచాన్ని చుట్టేస్తుంటాడు. నటులకు శరీరమే పెట్టుబడి. యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించినంత కాలం అవకాశాలకు కొదువ లేదు. కానీ అదంత సులభం కాదు. వేళాపాళా లేని షూటింగ్‌లతో కంటినిండా నిద్ర ఉండదు. టేక్‌లు, రీ టేక్‌ల పుణ్యమాని తీవ్ర అలసట వేధిస్తూ ఉంటుంది. ప్రయాణాల కారణంగా జీవన చక్రం గతి తప్పుతుంది. దురలవాట్ల కారణంగా కొందరిని ఊబకాయం, అధిక రక్తపోటు తదితర సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించడమే కాటిన్హో వ్యాపకం. ఆ పనిమీద ముంబై నుంచి హైదరాబాద్ వస్తుంటాడు. ఎంతోమంది సెలెబ్రిటీలను కలుస్తుంటాడు. ఆ జాబితాలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా ఉన్నారు. ‘మహేశ్ కుటుంబాన్ని ప్రేమిస్తారు. సినిమాలంటే ప్రాణం. ఆ రెండూ బ్యాలెన్స్ చేసుకోవాలంటే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. బరువు పెరిగినా తగ్గినా, సిక్స్‌ప్యాక్ అయినా సెవెన్ప్యాక్ అయినా.. నేల విడిచి సాము చేయకూడదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. ఆ విషయం తనకు తెలుసు. అందుకే, తన వ్యక్తిగత ట్రెయినర్‌తో సమన్వయం చేసుకుంటూ నా వంతు సలహాలు ఇస్తుంటాను. ఆయనలానే శరీరాన్ని గౌరవిస్తాను’ అంటాడు కాటిన్హో. మహేశ్‌బాబు ఏక్దమ్ ఫిట్‌గా ఉంటారు. అయినాసరే ఆయన వ్యాయామాన్ని, నిద్రను, పోషకాలను మేం బేరీజు వేస్తూ ఉంటాం. విటమిన్లు, ఖనిజాల లోపాలపై అప్రమత్తం చేస్తాం. బాడీ ట్రాన్స్ఫర్మేషన్కు అవసరమైన సలహాలు, చిట్కాలు అందిస్తాం. ఫిట్నెస్ గురించి తనకు మంచి అవగాహన ఉంది. చాలా క్రమశిక్షణగా ఉంటారు.
జాబితా పెద్దదే
కాటిన్హో సెలెబ్రిటీ క్లయింట్స్ జాబితా పెద్దదే. శిల్పా శెట్టితో మొదలైంది. తమన్నా, అనుష్క, షాహిద్‌కపూర్, విద్యాబాలన్, హృతిక్ రోషన్‌తో పాటు పేరు వెల్లడించడానికి ఇష్టపడని అనేకమంది తారలు ఉన్నారు. ‘లైఫ్‌ైస్టెల్ మెడిసిన్‌లో మందులు ఉండవు. ఎంతసేపు పడుకుంటారు, ఏం తింటారు, ఎంతసేపు సూర్యరశ్మిని ఆస్వాదిస్తారు, కుటుంబానికి కేటాయిస్తున్న సమయం ఎంత.. అన్నదీ గమనిస్తాం. మనిషిని బట్టి వైద్యం మారుతుంది’ అని వివరిస్తారు కాటిన్హో.
Read More :
“Tollywood | 2023లో మరణించిన టాలీవుడ్ సినీ ప్రముఖులు వీళ్లే..”
“Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






