Vishwa Bharath | ఒకప్పుడు ఊబకాయంతో బాధపడ్డాడు.. ఇప్పుడు సెలబ్రెటీలకే ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు!!
Vishwa Bharath | ఏక్దమ్ ఫిట్.. తరహా చురుకైన జీవనశైలిని అందరూ ఇష్టపడతారు. ఆ ప్రయత్నంలో రకరకాల వ్యాయామాలు చేస్తారు. డైట్ ఫాలో అవుతారు. పోషకాహారం తీసుకుంటారు. అయితే, ఇవి కొన్నిసార్లు చెడు చేసే అవకాశమూ ఉంది. కాబట్టి వ్యాయామం, డైట్ గురించి సరైన అవగాహనతోనే దుష్ప్రభావాలు లేని ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుంది. సెలెబ్రిటీ ఫిట్నెస్ శిక్షకుడు విశ్వభరత్ చెబుతున్నదీ అదే..
Vishwa Bharath | ఏక్దమ్ ఫిట్.. తరహా చురుకైన జీవనశైలిని అందరూ ఇష్టపడతారు. ఆ ప్రయత్నంలో రకరకాల వ్యాయామాలు చేస్తారు. డైట్ ఫాలో అవుతారు. పోషకాహారం తీసుకుంటారు. అయితే, ఇవి కొన్నిసార్లు చెడు చేసే అవకాశమూ ఉంది. కాబట్టి వ్యాయామం, డైట్ గురించి సరైన అవగాహనతోనే దుష్ప్రభావాలు లేని ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుంది. సెలెబ్రిటీ ఫిట్నెస్ శిక్షకుడు విశ్వభరత్ చెబుతున్నదీ అదే..
విశ్వభరత్.. స్టార్ ఫిట్నెస్ ట్రైనర్. ఆన్లైన్ ఫిట్నెస్ వేదిక ‘ట్రూఫిట్’ సహ వ్యవస్థాపకుడు. బరువు తగ్గడానికి సుస్థిరమైన జీవనశైలిని మించిన పరిష్కారం లేదని అతని అభిప్రాయం. విశ్వభరత్ సినీ నటులు అడివి శేష్, వెన్నెల కిషోర్ లాంటివారికి వ్యక్తిగత ఫిట్నెస్ శిక్షకుడిగా వ్యవహరించాడు. ఈ రంగంలో తన ప్రయాణం ఆసక్తికరం. గతంలో విశ్వ ఐటీ ఉద్యోగి. ఊబకాయంతో బాధపడేవాడు. ఆఫీసులో కొలీగ్స్ అతని బరువు మీద జోకులేసేవారు. ఫ్రెండ్స్ కూడా తననే బకరా చేసేవారు. దీంతో, అదనపు కొవ్వును వదిలించుకొనే మార్గం అన్వేషించాడు. విశ్వభరత్ సొంతూరు విశాఖపట్నం. ఐదేండ్ల కింద హైదరాబాద్‌కు మారాడు. అప్పటివరకూ అతనికి ఫిట్నెస్ను వృత్తిగా మలుచుకోవాలనే ఆలోచన లేనేలేదు. కానీ, ఇంజినీరింగ్ సమయంలో అందరు కుర్రాళ్లలాగే మెలి తిరిగిన కండరాలు మరులుగొలిపేవి. కొద్దిపాటి ప్రయత్నాలు చేశాడు కూడా. అది కూడా ఒకటిరెండు నెలల ముచ్చటే అయ్యింది. వ్యాయామం తగ్గించేశాడు. దీనికి చదువుల ఒత్తిడి తోడైంది. ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం మొదలైంది. అలా ఊబకాయం బారినపడ్డాడు. బెంగళూరులో ఐటీ ఉద్యోగంలో చేరే సమయానికి తను ఓ మోస్తరు ఐరావతమే. కోల్పోయిన ఫిట్నెస్ను తిరిగి తెచ్చుకోవాలని సంకల్పించుకున్నాడు. ఈ క్రమంలో జిమ్‌లో వెయిట్‌లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు వీపు దిగువభాగంలో గాయమైంది. మళ్లీ కొంత గ్యాప్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న వెంటనే ఫిట్నెస్ గురించి, పోషకాహారం గురించి పరిశోధన మొదలుపెట్టాడు. అనేక పుస్తకాలు చదివాడు. నిపుణులతో చర్చించాడు. వివిధ రకాల డైట్లను తనపై ప్రయోగించి చూసుకున్నాడు. మొత్తానికి ఇరవైరెండు నెలల కాలంలో గణనీయంగా బరువు తగ్గాడు. కొత్త వైద్యుడి కంటే.. పాత రోగే నయం.. అనే సామెత ఉండనే ఉంది. మొత్తానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోడానికి అత్యవసరమైన ఆహారాలు, కసరత్తుల గురించి ఆకళింపు చేసుకున్నాడు.
ఐటీ ఉద్యోగం వదిలి..
ఫిట్నెస్ను మెరుగుపరుచుకునే క్రమంలో తను సాగించిన సాధనను విశ్వభరత్ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అవి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. దాంతో గైడెన్స్ కోసం జనం సంప్రదించడం మొదలుపెట్టారు. వ్యాయామ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా రావడంతో ఐటీ ఉద్యోగం చేస్తూనే, పార్ట్‌టైమ్ ఫిట్నెస్ కోచ్‌గా ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి పూర్తిస్థాయి ఆన్లైన్ శిక్షకుడి అవతారం ఎత్తాడు. అలా విశ్వ తన అభిరుచి మేరకు 2020లో ఆన్లైన్ ఫిట్నెస్ శిక్షణ సంస్థ ‘ట్రూఫిట్’ను స్థాపించాడు. జనానికి.. సుస్థిరమైన (దీర్ఘకాలం ప్రయోజనం ఇచ్చే) ఫిట్నెస్ పరిష్కారాలను ఇవ్వడం విశ్వ లక్ష్యం. ప్రస్తుతం ‘గూఢచారి 2’ సినిమా కోసం అడివి శేష్‌కు ఫిట్నెస్ శిక్షణ ఇస్తున్నాడు. మరికొంత మంది సినీ నటులు కూడా అతని సేవలు పొందుతున్నారు. ‘నా శిక్షణలో బరువు తగ్గించుకున్న ప్రతి ఒక్కరూ నా గెలుపు పుస్తకంలో ఒక పేజీ లాంటివారే’ అంటాడు విశ్వ.
Read More :
“Tailor | ఈ దర్జీలు డ్రెస్సులు కుడితే ఆ దర్జానే వేరు.. అందుకే సెలబ్రెటీలు కూడా వాళ్ల వెంట పడతారు!”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

