Gaurav Gupta | ఎన్టీఆర్ అయినా.. ఐశ్వర్యరాయ్ అయినా ఈయన డిజైన్ చేసిన డ్రెస్ వేస్తే అదరహో అనాల్సిందే !
Gaurav Gupta | సినిమా వేడుకల్లో రెడ్ కార్పెట్ మీద నడక ఓ గొప్ప గౌరవం. ఆ అడుగులలో హుందాతనం, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కనిపించాలి. అందరి చూపులూ కార్పెట్ మీద నడిచే వ్యక్తితోపాటు, అతను లేదా ఆమె వేసుకున్న డ్రెస్ మీదా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆ డ్రెస్ డిజైనర్ గురించి కూడా చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో హాట్ టాపిక్.. గౌరవ్ గుప్తా.
Gaurav Gupta | సినిమా వేడుకల్లో రెడ్ కార్పెట్ మీద నడక ఓ గొప్ప గౌరవం. ఆ అడుగులలో హుందాతనం, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కనిపించాలి. అందరి చూపులూ కార్పెట్ మీద నడిచే వ్యక్తితోపాటు, అతను లేదా ఆమె వేసుకున్న డ్రెస్ మీదా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆ డ్రెస్ డిజైనర్ గురించి కూడా చర్చ జరుగుతున్నది. ఆ చర్చలో హాట్ టాపిక్.. గౌరవ్ గుప్తా.
తెలుగు సినిమాను ఎవరెస్ట్ శిఖరంపై నిలబెట్టింది.. ఆర్ఆర్ఆర్. ఆ ఆస్కార్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్‌ను రూపొందించింది ఎవరో తెలుసా? డిజైనర్ పేరు గౌరవ్ గుప్తా. దాదాపు రెండు దశాబ్దాలుగా ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణిస్తూ.. ఎంతోమంది సెలెబ్రిటీల అభిమాన డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు గౌరవ్. తను రూపుదిద్దిన దుస్తులతో రెడ్ కార్పెట్ మీద నడిచిన ఐశ్వర్యా రాయ్, అనన్య పాండే ‘బెస్ట్ డ్రెస్డ్ రెడ్ కార్పెట్ లుక్స్’ అనిపించుకున్నారు. 2023 గ్రామీ అవార్డు ఫంక్షన్లో వరల్డ్ ఫేమస్ ర్యాప్ సింగర్ కార్డి బీ.. అవార్డ్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించింది. ఆ వేడుకలో ఆమె గౌరవ్ ప్రాణంపోసిన నీలివన్నె వస్త్రధారణలో మెరిసిపోయింది. ఇలా చెప్పుకొంటూ పోతే అదో పెద్ద జాబితా.
భారతీయత ప్లస్ ఆధునికతగౌరవ్ గుప్తా నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ పట్టా అందుకున్నాడు. లండన్‌లోని సెంట్రల్ సెయింట్ మార్టిన్స్లోనూ చదువుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా ఓ కంపెనీ ప్రారంభించాడు. ఆధునికతకు భారతీయతను జోడిస్తూ గౌరవ్ రూపొందించిన డిజైనర్ వేర్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. అందుకే, ఏ అంతర్జాతీయ సినీ ఉత్సవం అయినా.. రెడ్ కార్పెట్ మీద గౌరవ్ డిజైన్ చేసిన దుస్తుల్లో తారలు హొయలు పోవాల్సిందే. ఎన్నో అంతర్జాతీయ మ్యాగజైన్ల మీద ముఖచిత్రాలుగా.. గౌరవ్ డిజైన్ చేసిన డ్రెస్సుల్లో తారలు తళుక్కుమన్నారు. దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, మేరీ జె. బ్లిగే, జెన్నిఫర్ హడ్సన్, మెక్సికన్ సింగర్ థాలియా.. ఈ దశాబ్ద కాలంలో ప్రపంచంలోని అగ్రతారలంతా గౌరవ్ కస్టమర్లే. ఈమధ్యే గౌరవ్ ముంబైలో తన ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించారు. ‘వాణిజ్య రాజధానికి వచ్చినవారంతా మా స్టోర్‌ను సందర్శించాలి. ఇదే నా కోరిక’ అంటాడు గౌరవ్.

Gaurav Gupta
అమ్మకూచి
గౌరవ్‌కు అమ్మ అంటే ప్రేమ. కొడుకు ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా సరే.. రోజుకు రెండుసార్లు ఫోన్ చేస్తారామె. గౌరవ్ ఆ కాల్స్‌ను తప్పక అటెండ్ చేస్తాడు. ఆ మధ్య నిర్వహించిన ఫ్యాషన్ షోకు ‘శూన్య’ అని పేరు పెట్టారు. ‘శూన్యం అనంతమైంది. ఫ్యాషన్ కూడా అనంతమైందే’ అని వివరిస్తాడు గౌరవ్. తనకు ప్రయాణాలంటే ఇష్టం. ఫొటోగ్రఫీని ప్రేమిస్తాడు. తరచూ పుస్తక పఠనంలో మునిగితేలతాడు. అమ్మాయిల అభిరుచులను ఇట్టే పట్టేసే ఆ హాటెస్ట్ ఫ్యాషన్ డిజైనర్.. పక్కా ఎలిజిబుల్ బ్యాచిలర్. గౌరవ్‌కు ఆరోగ్యం పట్ల మహాశ్రద్ధ. అప్పుడప్పుడూ డుమ్మా కొట్టినా.. యోగా చేయడం అలవాటే. ఈ మధ్యే గౌరవ్ అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడు. అక్కడినుంచి చూస్తే ముంబై మహా నగరం అద్భుతంగా కనిపిస్తుంది. ‘ఇంత అందమైన ప్రపంచంలో నాకు కాస్తంత చోటు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు’ అంటాడు గౌరవ్. అదే సమయంలో ‘గౌరవ్‌ను మా డిజైనర్‌గా ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్’ అంటారు సినీ తారలు, సెలెబ్రిటీలు. నిజమే, గౌరవ్ లేకపోతే ఆ సౌందర్యం అసంపూర్ణమే.
Read More :
సమంత, రష్మిక, పూజా హెగ్డే.. వీళ్లంతా ఈయనతో ఫొటోలు తీయించుకోవాలని అనుకుంటారట!!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- celebrities
- Gaurav Gupta
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

