సమంత, రష్మిక, పూజా హెగ్డే.. వీళ్లంతా ఈయనతో ఫొటోలు తీయించుకోవాలని అనుకుంటారట!!
Star Photographer Kalyan Yasasvi | మిరుమిట్లు గొలిపే లైటింగ్‌లో సమంత వెలిగిపోతుంది. పూలడ్రెస్తో పూజా హెగ్డే అందం మరింత వికసిస్తుంది. పొట్టి దుస్తుల్లో కేథరిన్‌ను చూసిన వారంతా.. ‘కెవ్వు కేక’ అనాల్సిందే. రష్మిక మందన్న, లావణ్య త్రిపాఠి, అమలాపాల్.. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కల్యాణ్ యశస్వి తీసే ఫొటోల కోసం క్యూ కట్టేస్తున్నారు.
Star Photographer Kalyan Yasasvi | మిరుమిట్లు గొలిపే లైటింగ్‌లో సమంత వెలిగిపోతుంది. పూలడ్రెస్తో పూజా హెగ్డే అందం మరింత వికసిస్తుంది. పొట్టి దుస్తుల్లో కేథరిన్‌ను చూసిన వారంతా.. ‘కెవ్వు కేక’ అనాల్సిందే. రష్మిక మందన్న, లావణ్య త్రిపాఠి, అమలాపాల్.. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కల్యాణ్ యశస్వి తీసే ఫొటోల కోసం క్యూ కట్టేస్తున్నారు.
‘ఫొటోగ్రఫీ ఓ యూనివర్సల్ లాంగ్వేజ్’ అంటాడు హైదరాబాదీ కుర్రాడు కల్యాణ్ యశస్వి. అదొక అద్భుతమైన కళ. ఆ ఆత్మను పట్టుకోగలిగితేనే ఎవరైనా రాణించగలరు. అలాంటి మెలకువలన్నీ ఒడిసిపట్టి.. సబ్జెక్ట్ ఎలాంటిదైనా సరే, తన కెమెరా కళ్లతో సరికొత్తగా చూపించగలడు కల్యాణ్. ఇండోర్, అవుట్ డోర్.. లొకేషన్ ఏదైతేనేం, తను కెమెరా పట్టుకుంటే చాలు.. అన్నీ అతనికి అనుకూలంగా మారిపోతాయి. అందమైన ఫొటోలు వశమైపోతాయి. కాబట్టే, సెలెబ్రిటీలు సైతం మెచ్చే స్థాయికి ఎదిగాడు కల్యాణ్ యశస్వి.

మాస్ కమ్యూనికేషన్‌తో మొదలు..
కల్యాణ్‌కు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. అందుకే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివి.. మీడియాలో స్థిరపడాలని అనుకున్నాడు. అందులోనూ అడ్వర్టయిజింగ్, విజువల్ కమ్యూనికేషన్స్ పట్ల ఆకర్షితుడు అయ్యాడు. కాలేజ్ ఈవెంట్లకూ ఫొటోలు తీసేవాడు. ఆ ప్రతిభను అసైన్మెంట్ జ్యూరీ మెంబర్ ఒకరు గుర్తించి, ఫొటోగ్రఫీలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఒకవైపు చదువు.. మరోవైపు ప్రవృత్తి. కొన్నిరోజులు మేధోమథనం తర్వాత మనసు చెప్పిన ఫొటోగ్రఫీనే ఎంచుకున్నాడు.
వెడ్డింగ్ ఫొటోగ్రఫీ నుంచి..
క్రమక్రమంగా ఆర్ట్ ఫొటోగ్రఫీలో ఆరితేరాడు కల్యాణ్. ఆ తర్వాత వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కొందరు కుబేరులు కల్యాణ్‌తో ఫొటోషూట్లు పెట్టుకునేవారు. అలా సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. స్టార్ హీరోయిన్లు సైతం క్లైంట్స్గా మారారు. తను తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, కల్యాణ్‌కూ క్రెడిట్ ఇచ్చేవారు. సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, రామ్ పోతినేని వంటి పాన్ ఇండియా స్టార్స్‌తో పాటు స్పోర్ట్స్ తారలు పీవీ సింధు, మిథాలీరాజ్ అతని ైక్లెంట్స్ జాబితాలో ఉన్నారు. తన 12 ఏండ్ల కెరీర్లో వేల ఫొటోలు తీశాడు. ప్రతీది ఓ అద్భుతమే.

సహజమైన కాంతితో ..
కల్యాణ్ సహజ కాంతిలో ఫొటోలు తీయడానికే ఇష్టపడతాడు. అందుకే అతని ఫొటోలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఆ పనితనాన్ని మెచ్చిన ఎన్నో సంస్థలు.. తమ మోడళ్ల కోసం ప్రత్యేకంగా ఫొటోషూట్స్ ఏర్పాటు చేస్తుంటాయి. గత ఏడాది జరిగిన ‘లివా మిస్ దివా’ తన టాప్ 20 మోడళ్ల ఫొటోలను కల్యాణ్‌తో తీయించింది. ‘ఫొటోగ్రఫీ ఓ భాష. అధ్యయనం చేస్తూనే ఉండాలి. అప్పుడే మీకు పట్టుబడుతుంది’ అంటాడు కల్యాణ్.
Read More :
సమంత, అఖిల్ ఫిట్నెస్ వెనుక ఉన్నది ఇతనే.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈయన శిష్యులే
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

