Health Benefits | కూరగాయల అంగడికి వెళ్తే ఆకుపచ్చ ఆకుకూరలు, ఎర్రటి టమాటాలు, తెల్లటి వెల్లుల్లి, పచ్చపచ్చటి దోసకాయలు కనువిందు చేస్తాయి. ఈ రంగులన్నీ మన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించేవే.
ఈ రంగు కూరగాయల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది. పక్షవాతం నివారణకు దోహదపడుతుంది. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. టమాట, బీట్రూట్, గులాబీరంగు ముల్లంగి, చెర్రీ పండ్లు, స్ట్రాబెర్రీ, ఉల్లిగడ్డలు, రెడ్ క్యాప్సికం, ఎర్రమిరపకాయలు లైకోపీన్‌కు చిరునామాలు.
ఆకుపచ్చ ఆహార పదార్థాల్లో ఇండాల్స్, ఐసోథయోసయనేట్స్ ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో ఇవి దోహదపడతాయి. ప్రత్యేకించి ఆకుపచ్చ ఆహార పదార్థాల్లో విటమిన్-కె, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. వీటిలోని ఫోలిక్ యాసిడ్.. పిల్లల మెదడు, వెన్నుపాముకు సంబంధించిన న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. ఆకుకూరలు, మునగ, బ్రకోలి, బ్రసెల్స్ స్ప్రౌట్స్, అవకాడో, కివీ పండ్లు, గ్రీన్ టీ, పుదీనా, కొత్తిమీర, దోసకాయలు ఆకుపచ్చ రంగు ఆరోగ్య ప్రదాయినులు.
ఈ రంగు కూరగాయల్లో ప్రత్యేకించి ఫ్లేవనాయిడ్స్, అలిసిన్ ఉంటాయి. పుండ్లను నయంచేసే గుణం వీటికి ఉంది. ఉల్లిగడ్డలు, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్, వెల్లుల్లి, ఎండు ఫలాలు ఈ పోషకాల గనులు.
వంగపండు (పర్పుల్) ఈ రంగుల్లో యాంథోసయనిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికం. ఇవి మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాదు.. రక్తపోటు (బీపీ)ను నియంత్రిస్తాయి. పక్షవాతం, గుండె జబ్బుల ముప్పు తగ్గిస్తాయి. వంకాయ, మేడిపండు, అంజీర, ఎర్రద్రాక్ష, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, వంగపండు వన్నె క్యాబేజీ, ప్లమ్ పండ్లలోని.. నీలి, వంగపండు తదితర వర్ణాలు ఎంతో మంచిచేస్తాయి.