కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
కరోనా ( Coronavirus ) రోగుల్లో కొత్త కొత్త లక్షణాలు ( Symptoms ) బయటపడుతున్నాయి. కోలుకున్న తర్వాత కూడా గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
కరోనా ( Coronavirus ) రోగుల్లో కొత్త కొత్త లక్షణాలు ( Symptoms ) బయటపడుతున్నాయి. కోలుకున్న తర్వాత కూడా గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చాలామందిలో శ్వాస రుగ్మతలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ( Lung infections ) కనబడుతున్నాయి. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జరీవాలా.

మొదటి దశకన్నా రెండో దశలోనే మనిషి శరీరంలోని పలు భాగాలపై కరోనా అధిక ప్రభావం చూపుతున్నది. శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులపై ముప్పేట దాడి చేయడమేకాక గుండెనూ వదలడం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమందిలో గుండెజబ్బుల లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయాసం (శ్వాసలో ఇబ్బంది), ఛాతి నొప్పి, ఆక్సిజన్ స్థాయి తగ్గడం, మైకం కమ్ముకోవడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి అయిదు లక్షణాలు ఇటీవల పలువురు రోగుల్లో ప్రధానంగా కనబడుతున్నాయి. చికిత్స సమయంలోనూ, కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. కొవిడ్‌నుంచి కోలుకున్న వారిలో 70 శాతం మంది గుండెజబ్బులకు సంబంధించిన ఏదో ఒక లక్షణంతో ఇబ్బంది పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కారణాలేమిటి?

చాలామంది శరీరంలో ఆక్సిజన్ కొరతే గుండె సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కరోనా తీవ్రత కారణంగా స్టెరాయిడ్స్ వాడకం, ఇన్ఫెక్షన్ ప్రభావం వల్లకూడా కొందరు హృద్రోగం బారిన పడుతున్నారు. టెన్షన్, భయం వల్లా కొన్నిసార్లు ఎటువంటి సమస్యలూ లేకుండానే ఆయాసం, ఛాతి నొప్పి వస్తున్నాయి. కరోనా వచ్చాక రక్తం చిక్కగా మారడం వల్లకూడా హార్ట్ ఎటాక్‌కు ఆస్కారం ఏర్పడుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో చేరడంతో ఆయాసం, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం, ఆక్సిజన్ స్థాయి తగ్గడం, చెమట పట్టడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఎలా గుర్తించాలి?

➤ మొదటిది శ్వాసలో ఇబ్బంది. సరిగా ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఆయాస పడటం వంటి సమస్యలు ఉన్నవాళ్లలో శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం గుండెపైనే కాకుండా ఊపిరితిత్తుల మీదా పడుతుంది.
➤ రెండోది ఛాతి నొప్పి. గుండె భారంగా ఉండటం, ఒక రకమైన అసౌకర్యం, అనవసర ఆందోళన కొందరిలో కనిపిస్తాయి. మరికొందరిలో భరించలేని నొప్పి ఉంటుంది. ఈ నొప్పి చేతులు, మెడ, ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

➤ మూడోది ఆక్సిజన్ స్థాయి తగ్గడం. చికిత్స పొందుతున్నవారు, కోలుకున్న వారిలోకూడా ఆక్సిజన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనబడతాయి. పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ స్థాయులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల సమస్య తీవ్రతను ముందుగా గుర్తించే అవకాశం ఉంది. ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల గుండె కొట్టుకోవడంలో మార్పులు, ఇతర ప్రభావాలు కనిపిస్తాయి.

➤ నాలుగో లక్షణమైన మైకం కమ్మడాన్నీ తేలిగ్గా తీసుకోలేం. కరోనా ప్రభావం అధికంగా ఉన్నవారిలో చికిత్స సమయంలో, కోలుకున్న తర్వాత కూడా అతిగా నిద్ర పోవాలనిపిస్తుంది. మగతవల్ల నిలబడటం, కూర్చోవడమూ కష్టమవుతుంది. విపరీతంగా చెమట పట్టడం
➤ అయిదో లక్షణం. అలసట, శారీరక బలహీనత, శ్వాస తీసుకోవడంలో అవస్థ, వైరస్ ప్రభావం వంటి కారణాలతో విపరీతంగా చెమట పట్టవచ్చు. ఇది గుండెపోటు ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఈ లక్షణాలున్నవారు తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక వ్యాధులున్నవారు నిత్యం వాడాల్సిన మందుల్ని పక్కన పెట్టేయడం వల్ల పాత జబ్బులు తిరగబెడుతుంటాయి. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, శారీరక కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఇది మంచిది కాదు. చిన్నపాటి వ్యాయామం అయినా చేయాలి. అంతేకాదు, నాలుగు గోడలకే పరిమితమవుతున్నందున, మితాహారం ఉత్తమం. ‘కొవిడ్ సీజన్ తర్వాత చూద్దాంలే..’ అన్న నిర్లిప్తతతో ఔషధాలు వాడక పోవడం మంచిది కాదు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న సాకూ సరికాదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ఫోన్లోనో, ఆన్లైన్ ద్వారానో డాక్టర్లను సంప్రదించే అవకాశం ఉండనే ఉంది.
నిర్లక్ష్యం వద్దు!

గత ఏడాది గుండె సమస్యలున్న ఓ వ్యక్తికి స్టెంట్ వేశాను. ఆయనకు మరో రక్తనాళంలో కొంతమేర బ్లాకేజీ ఉంది. దానికికూడా యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నాం. అయితే, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, నాలుగు రోజుల కిందట ఆయాసం వస్తున్నది, చెమటలు విపరీతంగా పడుతున్నాయంటూ వచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఏమీ లేవు.

‘కరోనా సోకిందేమో’ అన్న అనుమానంతో సీటీ స్కాన్ చేస్తే ఆయన ఊపిరితిత్తుల్లో వైరస్‌కు సంబంధించిన ఇన్ఫెక్షన్ తీవ్రంగా కనబడింది. అదే విధంగా తాండూరు నుంచి ఓ పేషెంట్ వచ్చారు. అతనిదీ అదే పరిస్థితి. కరోనా లక్షణాలు ఏవీ లేవు. ఛాతీ నొప్పి ఉందన్నారు. 2డీ ఇకొ పరీక్షద్వారా ఆయన గుండెలో మూడు నాలుగు పెద్ద రక్తం గడ్డలు ఉన్నట్లు గుర్తించాం. గుండె కుడి, ఎడమ భాగాల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఉన్నట్లు నిర్ధారించాం. రోగికి అంతకు ముందు ఎటువంటి గుండె సంబంధిత సమస్యలూ లేవు. కరోనా ప్రభావం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం. ఏ లక్షణాలనూ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– వరకవుల దుర్వాసరాజు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

