e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, జూన్‌ 14 : జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెడ్‌క్రాస్‌ పాలక కమిటీ సభ్యుడు, న్యాయసలహాదారుడు బెక్కెం జనార్దన్‌ మాట్లాడుతూ అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. రక్తదానం మరొకరికి పునర్జన్మనిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదాతలు ఆర్‌అండ్‌బీ డీఈ సంధ్య, ఆర్పిత, ప్రసన్న, ఝాన్సీరాణి, వీఎస్‌ ఆర్‌కే ప్రసాద్‌, ఆనంద్‌, అశ్విని నవదీప్‌, సంతోష్‌, మహ్మద్‌ ఫహీం, రహీం, కళ్యాణ్‌, మురళీధర్‌రెడ్డి, సాదీక్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కోశాధికారి సురభీ జగపతిరావు, సభ్యులు రమణయ్య, వైద్యాధికారి రజిని, సమన్వయకర్త చంద్రశేఖర్‌, అశోక్‌కుమార్‌, బాబుల్‌రెడ్డి, మేనేజర్‌ గాంధీ, సిబ్బంది వసుంధర, లత, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ట్రెండింగ్‌

Advertisement