e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు పోలీసులకు పండ్లు అందజేత

పోలీసులకు పండ్లు అందజేత

పోలీసులకు పండ్లు అందజేత

నర్వ, జూన్‌ 11: పాతర్‌చేడ్‌ గ్రామానికి చెందిన యువరైతు బోలుబండ వెంకటేశ్‌ నర్వ పోలీసులకు తన పొలంలో పండిన బ త్తాయిపండ్లను అందజేశారు. కరోనా కష్టకాలంలో 24 గంటలు ప్రజాసంక్షేమం కో సం పనిచేస్తున్న పోలీసులకు తనవంతుగా పండ్లను అందించానన్నారు. యువరైతు ఉ దారతను ఎస్సై నవీద్‌, పోలీసు సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్సై రాజేశ్‌, కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
ఎనర్జీ డ్రింక్స్‌ పంపిణీ
మరికల్‌, జూన్‌ 11 : మహబూబ్‌నగర్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో కరోనా నియంత్రణకు నిరంతరం పోరాడుతున్న పోలీసు లు, వైద్య సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్‌ను పంపిణీ చే శారు. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు రాజేశ్‌ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్నా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న పోలీస్‌ సిబ్బందికి, వైద్య సిబ్బందికి రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎనర్జీ డ్రింక్స్‌ను పంపి ణీ చేసినట్లు తెలిపారు. సీఐ శివకుమార్‌, ఎస్సై నా జర్‌, పీహెచ్‌సీలో సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్‌ ఇచ్చిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శివకుమార్‌, మరికల్‌ యువక మండలి అధ్యక్షుడు ఆం జనేయులు, కార్యదర్శి శ్రీకాంత్‌, సభ్యులు రాజేందర్‌, భాస్కర్‌, మల్లేశ్‌, రఘు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో..
నారాయణపేట టౌన్‌, జూన్‌ 11: ఏబీవీపీ ఫర్‌ సొసైటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏబీవీపీ నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని జిల్లా దవాఖానలో కరోనాతో బాధపడుతున్న రోగులకు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేశ్‌, పట్టణ ఉపాధ్యక్షుడు ఇంతియాజ్‌, నాయకులు చరణ్‌, వివేకానంద, వెంకటరమణ, గంగాధర్‌, శివచరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోలీసులకు పండ్లు అందజేత

ట్రెండింగ్‌

Advertisement