బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 11, 2020 , 00:46:20

ఆరోగ్య సమాజానికి పాటుపడాలి

ఆరోగ్య సమాజానికి పాటుపడాలి

గద్వాలటౌన్‌ : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ శృతిఓఝూ అన్నారు. సోమవారం నులిపురుగు జాతీయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌  మాట్లాడుతూ నులిపురుగుల నివారణతో పాటు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, అప్పుడే ఆరోగ్య వంతులుగా ఉంటామని సూచించారు. అలాగే మూఢ నమ్మకాలను విశ్వసించరాదని సూచించారు. జబ్బులు చేసిన వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం నులిపురుగుల నివారణ మాత్రలు చిన్నారులకు అందచేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శ్రీరాములు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శశికళ, డీపీఎంవో మల్లికార్జున్‌, సీహెచ్‌వో రామకృష్ణ, హెచ్‌ఈ మదుసూధన్‌రెడ్డి, నరేంద్రబాబులతో పాటు ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు  తదితరులు పాల్గొన్నారు. 


logo