సోమవారం 01 మార్చి 2021
Food - Feb 09, 2021 , 16:02:18

మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని తెలుసుకోవడం ఎలా?

మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని తెలుసుకోవడం ఎలా?

పోషకాహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పొందడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోగలుగుతాం. కానీ మనం నిజంగా ఆరోగ్యంగా ఉన్నామా.. మన రోగనిరోధక శక్తి బాగానే పనిచేస్తుందా.. అని మనకు ఎలా తెలుస్తుంది. ఇది క్షీణించిందంటే కరోనా లాంటి మహమ్మరితో పాటు చాలా రకాల ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని మనం ఎలా గుర్తించాలి అన్నది అసలు ప్రశ్న. అయితే మన రోగనిరోధక వ్యవస్థ బలహీనమైతోంది అని తెలుసుకోగలిగే.. సంకేతాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

అధిక ఒత్తిడి

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు మొదటి సంకేతం.. అధిక ఒత్తిడి స్థాయిలు. ఇది తెల్ల రక్త కణాలు, లింఫోసైట్ల సంఖ్య తగ్గడానికి దారితీస్తుంది. చిరాకు ఒత్తిడి పెరుగుతున్నాయంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని అర్థం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. అంటువ్యాధులైన సాధారణ జలుబు, విరేచనాలు మొదలైన వాటి బారిన పడే ప్రమాదం ఉంది.

తరచుగా అంటువ్యాధులు

శరీరంలో తెల్ల రక్త కణాలు తగ్గినప్పుడు మనం అంటువ్యాధుల బారిన పడుతుంటాం. కాబట్టి మీరు ఐదుసార్లు కంటే ఎక్కువ చెవి ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక బ్యాక్టీరియా సైనసిటిస్, రెండు కంటే ఎక్కువ సార్లు న్యుమోనియాతో బాధపడుతుంటే, లేదా సంవత్సరంలో మూడు కంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ అవసరమైతే  మీ రోగనిరోధక శక్తి తగ్గుతుందని సంకేతంగా భావించాలి. తర్వాత రోగనిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెట్టాలి. 

అలసట

రోగనిరోధక శక్తి మీకు రాత్రిపూట తగినంత నిద్రను అందిస్తుంది. అది తగ్గుతుందంటే.. నిద్రలేమి, అలసట లాంటివి వస్తుంటాయి. రోజంతా మందగించేలా చేయడమే కాక..శక్తిని తగ్గిస్తుంది. 

గాయం ఆలస్యంగా తగ్గడం

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కొత్త చర్మాన్ని త్వరగా ఉత్పత్తి చేయనివ్వదు. ఫలితంగా గాయాలు చాలా నెమ్మదిగా కోలుకుంటాయి.

కీళ్ల నొప్పులు

తరచుగా కీళ్లలో నొప్పులు బలహీనమైన రోగనిరోధక శక్తికి అతిపెద్ద సంకేతాలు. ఎందుకంటే మీ రోగనిరోధక తక్కువగా ఉంటే.. మీరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లేదా ఇన్ఫెక్షన్ కారణంగా రక్తనాళంలో వాస్కులైటిస్ అనే వాపును ఎదుర్కొంటారు. కీళ్ల లోపలి పొరలో మంట కారణంగా వాపు, నొప్పి లాంటి సమస్యలను ఎదుర్కొంటారు.

VIDEOS

logo