Food
- Sep 03, 2020 , 22:30:22
ఇమ్యూనిటీ ఫుడ్ జామకాయ రోటి పచ్చడి

కావాల్సిన పదార్థాలు :
జామకాయలు : 3, కొత్తిమీర : అర కప్పు, పుదీనా తరుగు : అర కప్పు, పచ్చిమిర్చి : 5, ఎండుమిర్చి : 4, వెల్లుల్లి రెబ్బలు : 5, నూనె : టేబుల్ స్పూను
చింతపండు, ఉప్పు : తగినంత, తాలింపునకు : కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ
తయారు చేసే విధానం :
నూనెలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొద్దిసేపు వేగించిన తర్వాత జామకాయ ముక్కలు, కొత్తిమీర , పుదీనా ఒకటి తరువాత ఒకటి వేగించాలి. అన్నీ చల్లారాక ఉప్పు, చింతపండు, వెల్లుల్లి కలిపి నూరుకోవాలి. ఆ తర్వాత విడిగా పెట్టుకున్న తాలింపు కలపాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
తాజావార్తలు
MOST READ
TRENDING