ఇటు తెలంగాణలో, అటు దేశంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే దేశంలో, రా్రష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ను వద్దనుకుని పక్కనపెట్టారు. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వొద్దని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించడం ఆ పార్టీ రైతు వ్యతిరేకతను తెలియజేస్తున్నది.
అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఏం చేసింది. వాళ్ల ప్రభుత్వం అంతా అవినీతి మయం, వ్యవసాయ విత్తనాలు, పిచికారీ మందులు, ఎరువులు అన్నింట్లోనూ కల్తీలే. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయం బోరు బావులు, రుతు పవనాల మీద మాత్ర మే ఆధారపడి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ఏ సమయానికి కరెంట్ వస్తుందో తెలియదు, వచ్చిన కరెంటు ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు. మోటర్లు, బోర్లు ఇబ్బందులుకు గురిచేసి చాలామంది రైతులు కరెంటుషాక్తో మరణించే పరిస్థితి ఉండేది. రాత్రి సమయాల్లో రైతులు పొలాల్లో శవమయ్యేవారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బహుమతి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అతివృష్టి వచ్చినా కరువు ప్రకటించే పరిస్థితి లేదు. అదే ఆంధ్రలో అరటి చెట్టు విరిగినా సాయం ప్రకటించి నిధులు మళ్లించేవాళ్లు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా జరిగింది. పావలా పనులు చేసి రూపాయి పేరు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తున్నది. పలు రాష్ర్టాలు, తెలంగాణ చేపట్టిన పథకాలను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంటే, దేశం చూపంతా తెలంగాణపైనే ఉన్నది. అదేవిధంగా రైతుబంధు, రైతు బీమా, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ నిత్యం ఏదో ఒకటి లేవనెత్తి ఆరోపణలు కురిపిస్తుంటుంది. దేశంలో కూడా కాంగ్రెస్కు అధికారం ఇవ్వకుండా ప్రజలు ఎప్పుడో చెక్ పెట్టారు. అరవై ఏండ్ల పాలనలో అవినీతినంతా మూట కట్టుకున్నది. స్కాంలు చేయటంలో నిమగ్నమై అభివృద్ధిని విస్మరించిన ఏకైక పార్టీ కాంగ్రెస్.
తెలంగాణలో రైతులకు, సబ్బండ వర్గాల ప్రజలకు, కులవృత్తులు, చేతి వృత్తులకు ఆసరా కల్పిస్తూ, అన్నిరం గాల్లో అభివృద్ధి చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని గర్వంగా చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం ఇస్తే మళ్లీఅంధకారమే అవుతుందనటంలో సందేహం లేదు. అందుకే తెలంగాణ సమాజం రాను న్న ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్పాలి.
-కిరణ్ ఫిషర్
91336 61793