కాంగ్రెస్ పాలనల కరువాయె పని
కూలీ లేక సుతారికి
కూడు కరువవుతోంది
పనులు చేసుకొని బతికే బతుకు
బరువైపోతోంది పనులు లేక
పట్నంల వలస కూలీలు
అడ్డా మీద
ఆవుల సంతల అగుపడుతున్నరు
మట్టి పని మనిషి బతుకు భారమాయె
భవన కార్మికుల బతుకు ఘోరమాయె
ఇండ్ల కిరాయిలకు ఇబ్బంది ఆయె
అప్పులోడి ఇంటికాడ అడుగుడు మొదలాయె
సుతారి పనికి దేవులాడుతుండ్రు
ఆకలి తీర్చుకోవడానికి అడుక్కుంటుండ్రు
సద్ది పట్టుకొని అడ్డా మీద నిలబడితే
మధ్యాహ్నం దాటినా మందలియ్యరు ఎవ్వరు
పనికి రమ్మని పిలిసేటోడు దిక్కు లేడు
మన కాంగ్రెస్ ప్రభుత్వం మనలా ఆగము చేసే
బతుకుదెరువు కోసం ఇగ బాధపడుడేనా
ఆయల్లా అడ్డా కూలీ ఆకలి తీర్చింది
ఎందుకో ఈయాల ఎండబెడుతోంది
ఆడోల్లు అందరికీ అకౌంట్ల
రొండు వెయ్యిల ఐదు వందలు ఏస్తననే
ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అందిస్తననే
అడ్డా మీద కూసొని అనుకున్న మాటలు
కలిసి మాట్లాడుకునే కాంగ్రెస్ జోలి
భవనాలు కట్టుడే బందై పాయె
కూలీల బతుకు కూలిపాయె
ఇది అక్కరకురాని సర్కార్
అవి ఆకలి తీర్చని పథకాలు