రాలిపోతున్న రైతులను
రక్షించే నేత కావాలి
అన్నం పెట్టి ఆకలి తీర్చే హాలికుని
ఆత్మహత్యలు ఆపే అధినేత రావాలి
సాధించుకున్న తెలంగాణలో
చచ్చిపోయే సంక్షేమాన్ని సంజీవంగా
సాగించే నేత కావాలి
ఎవుసం చేసి గిట్టుబాటు ధర లేక
మట్టి పువ్వులై మాడి రాలిపోతున్న
మల్లెలంటి రైతులకు మంచి చేసే
మంచి నాయకుడు కావాలి
కాపుదానం చేసి కాపురాలు కూలిపోతున్న
రైతుల కాపాడే వారే కావాలి
సేతానం చేసి చెడిపోయే రైతుల
చెదరకుండా చేసే ప్రభుత్వ కావాలి
భూమిని దున్ని
బువ్వ పెట్టేవాడు లేకుంటే
భూమి మీద మనిషి బువ్వ తినకుండా
సుద్దులు చెప్పగలడా
నాగలి పట్టి నేలను దున్ని సాలు తోలి
చెలకమట్టిలో చెమట చుక్కలు కారిసి
నాలుగు విత్తులు పండిస్తే నైవేద్యం పెట్టుకుంటున్నా
రాజుకైనా రాతి బొమ్మకైనా
ఆకలి తీర్చేవాడే హాలికుడు
కాపాడే వాడు కావాలి రావాలి
– దేవరపాగ కృష్ణయ్య 9963449579