ఓటంటే ..
వేలికంటిన సిరాగుర్తు కాదు
నీ బొటనవేలితో పెట్టే బొట్టు కాదసలు
తెల్లకాగితంపై గుద్దే ముద్ర అంతకన్న కాదు
ఓటంటే.. ఈ దేశ భవిష్యత్తు
ఓటంటే..
మందుసీసాకో కల్లుసీసాకో
కాన్కెబెట్టడానికి ఇస్తరాకులో ఎడకాదు
ఓటంటే
ఈ దేశ నవనిర్మాణం
కుద్దుగా సెప్పాలంటే నీ నుదుటి రాత.
ఓటంటే..
జేజేలు జిందాబాద్‌లు కొట్టడంకాదు
కండువాలు కప్పుకొని
జెండాలు మోయటం
అస్సలే కాదు
ఓటంటే..
మన దేశ రాజ్యాంగ శాసనం
జిద్దుగా ప్రజాస్వామ్య ఆచరణత్వం.
ఓటంటే..
కొత్త కరెన్సీ నోటు కాదు
సిత్తుబొత్తులాంటి హామీలు అసలేకాదు
పత్తలేని ఉత్తమాటల మూటలు కానేకాదు
ఓటంటే..
అసెంబ్లీలో జన గీతిక
పార్లమెంట్లో నీ గొంతుక.
– అవనిశ్రీ 99854 19424