యూరియా కోసం
పొద్దుతో పోటీ పడుతున్న రైతులు
ముందుచూపు లేని పాలనతో
రైతుల ఇక్కట్లు
ఖాకీ పహారాలో
చెప్పుల వరసలు!
అన్నదాతల అవస్థలను
పట్టించుకోని పాలకులు
చీమల బారుల
మహిళలు, రైతులు
ఒక పక్క అతివృష్టి
మరోపక్క యూరియా అనావృష్టి!
పనిపాట విడిచి
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
తిండి తిప్పలు మరిచి
చెట్ల కిందనే సేద తీరుతున్నారు
కన్నుల్లో ఒత్తులేసుకొని
యూరియా కోసం ఎదురుచూపులు!
ఓపిక నశించి
తిరుగబడుతున్న వైనం
యూరియా యుద్ధంలో
గాయపడిన రైతులెందరో
చివరికి చేసేది ఏమీ లేక
రోడ్డెక్కిన రైతులు
ప్రజాపాలనలో
పడరాని కష్టాలు!!
– ఎదిరెపల్లి కాశన్న