బలహీన పడిన మొక్క
కన్నీటి పర్యంతమైంది
ఎరువు బలం లేక
ఏకరువు పెట్టుకుంది
సత్తువ లేని నేల సన్నగిల్లింది
ఒట్టి మట్టి మాత్రమే మిగిలింది
కింద మీద పడి ఏడ్చినా
కనికరించే కాలం పోయింది
రైతు చెమట చుక్క
భూమిలోకి ఇంకిపోతోంది
బారులు తీరినా ఎరువు
కరువుగానే మిగిలిపోతోంది
నానా అవస్థల మధ్య
మొక్క ప్రాణం నిలపాల్సి వస్తోంది
నిద్ర లేని రాత్రుళ్లను
గడపాల్సిన రైతు బతుకైంది
తోపులాటల తొట్రుపాటుతో
నిరాశదే పైచేయి అయిపోయింది
ఎరువు కరువైపోయినాక
చెట్టు బతుకు కష్టమైపోయింది
అడుగడుగునా
మడుగులొత్తే పరిస్థితులు
ఎరువు కోసం కాపు కాచే స్థితులు
కడుపును ఎండగట్టినా
దొరకని దీనావస్థలో రైతు జీవితాలు
సంకటంతో మొక్కను
కాపాడుకోలేని స్థితిగతులు
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636