పొద్దుపొడుపులా కాళేశ్వరం
సూర్యగోళంలా జలగోళం
పొలాల్లో విరజిమ్మిన సలిలక్షేత్రం
కురిసిన చినుకు కడలిపాలు కాకుండా
నీటి బిందువులను వొడిసిపట్టి
నిజం చేసిన దక్షుడు
కళ్లు నిజమే చెప్పినా మనసే
అబద్ధం చెప్పుతుంది
నరంలేని నాలుకకు లెక్కలేని వంకర్లు
మాటలు కోటలు దాటినా
చేతలు గనుమ దాటలె
నిందించడమే తప్ప నిలబెట్టింది శూన్యం
నీటి వసంతాన్నీ
ఒప్పుకోలేని కురుచతనం
చుక్కనీరు లేని చెరువులు కాలువలు
పొలాలెండి పంటలందక ఆత్మహత్యలు
నీళ్లులేని గోసలు కరువు
కల్లోలాలు మరిచిపోతె ఏట్లా?
గలగల నీరు ప్రహహిస్తుంటే
కన్ను కుట్టింది
జలభాండాగారమే పనికిరాదంటూ
‘ఉత్తర’కూతలు
మా ఊరు ఏరు తలాపున
నేలనేలంతా పలుగుతేలిన ఎడారి
తాగు సాగునీరంతా కన్నీరే
కంటికే కునుకురాని
ఆంధ్రాపాలన అరిగోసనే
ఉద్యమయోధుడి జల స్వప్నం
కాళేశ్వరం కూలేశ్వరమంటూనే
హైదరాబాద్కు నీళ్లంటడు
మూసీ జీవగంజికి కాళేశ్వరమే దిక్కాయే
జలసాధకుడి కీర్తిని ఒప్పుకోని లేకితనం
కలలులేనివాడు
నిర్మాణాలను నిర్మించలేడు
పెదవుల ఆరాటమే తప్ప గుండెతడిలేదు
మాటైనా పాటైనా
తొలికోడి కూతలా ఉండాలి
తెలంగాణ జలోదయమే కాళేశ్వరం!