CM Mamata Banerjee | కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వైద్యులను నేను బెదిరించినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. వైద్యులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. వారి పోరాటంలో న్యాయం ఉంది. నేను మాట్లాడింది బీజేపీకి వ్యతిరేకంగా. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా గళం విప్పాను.