మానవ పరిణామక్రమంలో మనిషి పుట్టుక -చావుల మధ్య నడిచే జీవన విధానం ఆ మనిషి విలువను తెలియజేస్తుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు. ప్రతి మనిషి పుట్టుక వెనుక ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది. ఆ మర్మం తెలిసిన పరమశివుడు కొంతమంది కారణజన్ములను ఈ భూమిపైకి పంపుతాడు. అలా తెలంగాణ గడ్డపై జన్మించిన కేసీఆర్ మనకు కారణజన్ముడయ్యాడు.ఈ విషయాలన్నీ వేదాంతంలా అనిపించవచ్చు. కానీ, కారణం లేనిదే కారణజన్ముడు జన్మించడు.
దగా పడుతున్న తెలంగాణకు కేసీఆర్ అవసరం ఏర్పడింది. అందుకే పాలమూరును కాదని వెళ్తున్న కృష్ణ మ్మను అకుంఠిత దీక్షతో బీళ్లకు మళ్లించి అపర భగీరథుడుగా కీర్తించబడుతున్నాడు. నేడు బీడుబారిన నేలతల్లి ఒడిలో విత్తు లు పడుతున్నాయి. అరతడి గొంతుతో చెలిమెలు తోడిన చేతులు నేడు చప్పట్ల సవ్వడి చేస్తున్నాయి. కాడి పక్కన పెట్టిన రైతన్న నేడు వృషభరాజుల రంకెలతో మెడలోని గంటలతో సందడి చేస్తూ నాగలితో దున్నుతూ తెలంగాణకు రాజయ్యా డు. తెలంగాణకు పాడిపంటల పచ్చటి తోరణం కట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణను ధాన్యరాశుల అక్షయ పాత్రగా మార్చా రు. పాలమూరు నేలపై కేసీఆర్ పాదం మోపిన రోజు నుంచి తెలంగాణకు మంచి రోజులు వచ్చాయి. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎంతోమంది దశాబ్దాలుగా పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని విజయ తీరాల వైపు నడిపించిన వీరుడు మాత్రం కేసీఆర్ ఒక్కరే.
పాలమూరును ఏమార్చిన నాయకులను చూశాం. కానీ పాలమూరు స్థితిగతులను మార్చిన నాయకుడిని మాత్రం కేసీఆర్ రూపంలో చూస్తున్నాం. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి పాలమూరు అంకురార్పణ చేసింది. పాలమూరు కరువు గోస గురించి అణువణువు తెలిసిన కేసీఆర్ తెలంగాణ సాధనతో పాలమూరు కరువును రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారు. రాజోలిబండ వద్ద కేసీఆర్ కన్నీటి గోస పాలమూరు కరువు గోసకు ముగింపు పలికింది.
పాలమూరు పార్లమెంట్ సభ్యుడుగా ఉండి తెలంగాణను సాధించడంతో కరువుతో అల్లాడిన పాలమూరు నేల పావనమైంది. తెలంగాణ ఏర్పాటుతో పాలమూరు నవశకం ప్రారంభమైంది. పాలమూరు జిల్లాలో చెంతన నీళ్లు ఉన్నా సాగు నీటికి నోచుకోక, వానకాలం పంటలతో సరిపెడుతున్న రైతన్నలకు పాతాళంలో ఉన్న కృష్ణానది నీళ్లతో యాసంగి పంటలకు సాగు నీళ్లు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాంది పలికిన నాయకుడు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లను డ్రా చేసుకునే విధంగా కోతిగుండు నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా 240 మీటర్ల ఎత్తులో లిఫ్ట్ చేసి రైతులకు సాగు నీళ్లు అందిస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్టును ఈ నెల 16న సీఎం కేసీఆర్ జాతి కి అంకితం చేసి నయవంచక పాలకుల నుంచి పాలమూరుకు శాశ్వత విముక్తి కల్పించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలాలకు సాగు నీళ్లు అందడంతో పాటు చెలిమెలకు చరమగీతం పలికేందుకు మిషన్ భగీరథ పథకానికి నీటి కేటాయింపులు జరిగాయి. వలసలు వెళ్లిన పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు పాలమూరు జిల్లాలోని పరిశ్రమలకు కూడా నీళ్ల కేటాయింపులు ఉన్నాయి. పాలమూరుపై వివక్ష చూపిన సమైక్య పాలకుల ముందే తెలంగాణ అభివృద్ధిలో పాలమూరు ఉండటం మన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు గమనించాల్సిన విషయం. పాలమూరు ప్రజల కలల ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు ఎదురైనా, అనుకున్న లక్ష్యం నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు పట్టువదలని నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం పాలమూరు ప్రజలు చేసుకున్న అదృష్టం.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి బీడు వారిన పొలాలకు సాగు నీళ్లందించే క్రమంలో పాలమూరు అభివృద్ధి నిరోధకులు ప్రజల నోట్లో మట్టి కొట్టేందు కు పూనుకున్నారు. ఏకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేసి సాగునీటి ప్రాజెక్టుపై విషం కక్కారు. నాడు కృష్ణానది కింద ఉండి పొలాలు పైన ఉన్నాయి. పొలాలకు సాగు నీరు అందించడం కష్టం అన్న సమైక్య పాలకుల వారసులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చివరి అంకం వరకు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంటే మన పాలమూరు నాయకు ల చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతున్నది. పాలమూరు భవిష్యత్తు కోసం పౌరుషానికి పెట్టింది పేరుగా ఉన్న నడిగడ్డ రాజోలిబండపై, కరివెన వద్ద పీఆర్ఎల్ఐ పునాది రాయిపై కేసీఆర్ నిటారుగా నిలబడ్డారు. పాలమూరును కరువు గోస నుంచి విముక్తి చేసేందుకు హరిహరాదులు అడ్డొచ్చినా వారి కండ్ల ముందే పీఆర్‌ఎల్‌ఐని పూర్తి చేస్తానని శపథం పూని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పాలమూరు రైతుల గోసను తీర్చిన అపర భగీరథుడు మన కేసీఆర్.
పాలమూరు గోసను చూసి చలించి, పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధించి, పాలమూరు ప్రజల బాధలను, వ్యథలను పోగొట్టిన నాయకుడు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు కొల్లాపూర్ గడ్డపై అడుగు పెట్టిన సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి పాలమూరు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ‘మా కేసీఆర్ వస్తున్నాడు మా బీడు భూములకు సాగు నీళ్లు తెస్తున్నాడని లక్షలాదిగా కొల్లాపూర్‌లో కవాతు చేశారు. రెండు లక్షల మంది కొల్లాపూర్ బహిరంగ సభలో పాల్గొనడంతో కొల్లాపూర్ జనసంద్రంతో నిండిపోయింది. పాలమూరులో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొల్లాపూర్‌ను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. నేడు కొల్లాపూర్ అభివృద్ధిలో ముందుందంటే అది కేసీఆర్ చలువే.
సోమశిల, సిద్ధేశ్వరం వంతెనతో కొల్లాపూర్ దశదిశను సమూలంగా మార్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చివరి పల్లెలను కూడా పట్టణాలుగా మార్చి పాలమూరు ప్రజ ల పాలిట కారణజన్ముడయ్యారు. ఈ రోజు పచ్చబడిన నేల కేసీఆర్‌ను తలుచుకుంటుంది. నాడు కళాహీనంగా ఉన్న చెరువులు నేడు జలకళతోనిండి నిండు మనుస్సుతో కేసీఆర్‌ను దీవిస్తున్నాయి. తెలంగాణ కోసం పుట్టిన మహాపురుషుడు కేసీఆర్. తెలంగాణ సాధనతో పాటు ప్రతి గుంటకు, ప్రతి సెంటుకు సాగు నీళ్లు అందిస్తూ, తెలంగాణ సగటు జీవన విధానాన్ని పెంచి తన కర్తవ్యాన్ని దిగ్విజయం గా పూర్తి చేసుకున్న నాయకుడు కేసీఆర్ వెంట మనమందరం ఉండాలి. మన కరువు గోసను తీర్చి మన భవిష్యత్తు తరానికి బంగారు బాట వేసిన కేసీఆర్ కోసం మనం నిలబడాలి.
– దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి 90300 15999