2025, ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటల కు చిత్తూరులోని నాయుడు బిల్డింగ్స్, విజయం డిగ్రీ కళాశాల సమావేశ మం దిరంలో ‘గంటా కమలమ్మ సాహితీ పురస్కారం’ ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. 2024 కోసం నిర్వహించిన పోటీలో పురస్కారాలకు తెలంగాణ నుంచి నల్గొండ జిల్లాకు చెందినతుల శ్రీనివాస్ రాసిన ‘చింతల తొవ్వ’, ఏపీ నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాంబమూర్తి లండ రాసిన ‘నాలుగు రెక్కల పిట్ట’ కవితా సంపుటాలు ఎంపికయ్యాయి. డాక్టర్ రాధేయ (అనంతపురం), డాక్టర్ రఘు (హైదరాబాద్) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పురస్కార గ్రహీతలను రూ.10 వేల నగదుతో పాటు, జ్ఞాపికతో సత్కరించనున్నట్టు నిర్వాహకులు గంటా మోహన్, రాజా, రాజేంద్ర తెలిపారు.
2025, ఫిబ్రవరి 8, 9వ తేదీలలో సిద్దిపేటలోని విపంచి కళా నిలయం లో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక 16వ వార్షిక సదస్సు జరుగనున్నది. అంబేద్కర్ ప్రభావంతో తెలుగు సాహి త్య విమర్శను అభివృద్ధి చేసిన బోయి విజయభారతి స్మారకోపన్యాసం, అంబేద్కర్ ఆలోచనల స్ఫూర్తి కవి సమ్మేళనం జరుగనున్నది. ఈ సదస్సుకు సాహిత్యకారులు అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవం తం చేయాలని కోరుతున్నాం.