రాష్ర్టాల సమాహారమే భారత్
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్కడా వాడలేదు. ఇది నిజం. ఏ రాజ్యాంగమూ
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్కడా వాడలేదు. ఇది నిజం. ఏ రాజ్యాంగమూ అన్ని విషయాలను కూలంకషంగా చెప్పదు. రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణాలను మనమే కాలానుగుణంగా అన్వయించుకోవాలి. అదే రాజకీయ విజ్ఞత. అంతేకానీ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను సంకుచిత దృష్టితో చూస్తే మనకు విషయం అర్థం కాకపోగా గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉన్నది. దీనిపట్ల సమాజం జాగరూకత వహించాలి. అది భావితరాల భవితకు మంచిది.
మన రాజ్యాంగం సమాఖ్యస్ఫూర్తిని 246వ అధికరణంలో పేర్కొన్నట్లు 7వ షెడ్యూల్ స్పష్టంగా చెప్తుంది. శాసన, కార్యనిర్వాహక, రాజ్యాధికారాలను మూడు జాబితాలుగా వర్గీకరించింది. అవే కేంద్ర, రాష్ర్టాల, ఉమ్మడి జాబితాలు. దీని అర్థం ఏమంటే రాష్ర్టాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవి కావు. రాష్ర్టాలకున్న గుర్తింపు చారిత్రకమైనది. భాష, సాహిత్యం, ఆచార సంప్రదాయాలు ఆయా రాష్ర్టాల సాంస్కృతిక సంపద. ఆయా రాష్ర్టాలకున్న గుర్తింపు వాటి సొత్తు. వాటికి నిర్దిష్టమైన ఉనికి ఉన్నది. ప్రాదేశిక గుర్తింపు శాసనం ద్వారా వచ్చినప్పటికీ, శాసనానికి ఆధారం ఆయా ప్రజల చారిత్రక నేపథ్యం. 1956లో భాషా ప్రాతిపదికగా రాష్ర్టాలు ఏర్పడటానికి ఈ చారిత్రక నేపథ్యం కీలకం. భాషా ప్రాతిపదికన రాష్ర్టాలు ఏర్పడటానికి తెలుగువారే కారణం. అలా ఏర్పడిన రాష్ట్రం బలీయంగా ఉన్నా ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చలేకపోయినప్పుడు, ఆ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టాన్ని పునర్వ్యవస్థీకరించుకున్నదీ తెలుగువారే.
రాజ్యాంగసభలో 1949 నవంబర్ 25న జరిగిన సమావేశంలో రాష్ర్టాల హక్కుల విషయం చర్చకు వచ్చింది. కొందరు సభ్యులు మన రాజ్యాంగం అధికారాల కేంద్రీకరణకు మొగ్గుచూపిందని అభిప్రాయపడ్డారు. అంటే రాజ్యాధికారాలు ఎక్కువగా కేంద్రానికి కట్టబెట్టిందని వారి భావన. దాన్ని తోసిపుచ్చుతూ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు నేడు మననం చేసుకోవాలి. సమాఖ్య అన్న మాట వాడకపోయినా మనది సమాఖ్య వ్యవస్థ అని సుస్పష్టంగా చెప్పారు. ‘ఏ సమాఖ్యకైనా ప్రధాన సూత్రం కేంద్రానికి రాష్ర్టాలకు మధ్య శాసన అధికారం, కార్యనిర్వాహక అధికార విభజన రాజ్యాంగం ద్వారా జరగటమే గానీ కేంద్రం చేసే శాసనం ద్వారా జరగటం కాదు. మన రాజ్యాంగం కూడా ఈ సంప్రదాయాన్ని పాటించింది’, అని అంబేద్కర్ అన్నారు. ‘మన వ్యవస్థలో రాష్ర్టాలు కేంద్రం మీద ఆధారపడి ఉండవు. రాష్ర్టాలు కేంద్రానికన్నా ఏ విషయంలోనూ తీసిపోవు. ఈ విషయంలో రాష్ర్టాలు, కేంద్రం సమ భాగస్తులు. అంతేకానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు’ అని అంబేద్కర్ స్పష్టం చేశారు. ‘కేంద్రం అధికార పరిధి మిగతా సమాఖ్యల కన్నా కాస్త పెద్దదిగా ఉన్నమాట వాస్తవం. ‘రెసిడ్యువరీ’ అధికారాలు కూడా కేంద్రానికి ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఇవన్నీ ముఖ్యం కాదు. అధికార విభజన రాజ్యాంగం ద్వారా జరిగిందా లేదా అనేదే ముఖ్యం’ అని విపులీకరించారు బాబాసాహెబ్. రాజ్యాంగాన్ని లిఖించిన మహా మేధావి నోటి వెంట వచ్చిన మాట ఇది. మనరాజ్యాంగ వ్యవస్థలో రాష్ర్టాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది రాజ్యాంగ నిర్మాతల భావన.
కానీ నేడు జరుగుతున్నదేమిటి? కేంద్రం, రాష్ర్టాలు సమాన భాగస్వాములన్న స్ఫూర్తి ఏమైంది? కాలగర్భంలో కలిసిపోయింది. దీనికి ఉదాహరణ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను ఉమ్మడి జాబితాలోకి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చటం. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో 42వ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చింది. ఇది రాష్ర్టాలను సంప్రదించకుండా తీసుకున్న ఏకపోకడ చర్య. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. కానీ దీనిమీద ఎవరూ నోరుమెదపలేదు. ఈ మార్పు నేడు ఏకు మేకైంది. దీని పర్యవసాన మే నేడు ‘నీట్’ పరీక్ష విధానం.
విద్య అనే అంశం రాష్ట్ర జాబితాలోనే ఉండాలి. దీనిమీద రాష్ర్టాలు కలసి పోరాడలేకపోతున్నాయి. అది వేరు విషయం. తమిళనాడుది ‘నీట్’ సమస్య యితే, తెలంగాణది ‘నీటి’ సమస్య. రాష్ర్టాలకు ఉమ్మ డి కార్యాచరణ లేదు. అయితే ఇక్కడ కేంద్రాన్ని, రాష్ర్టాలను వైరి వర్గాలుగా చూడవద్దు. ఇరు వ్యవస్థలు దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్నే కోరుకోవా లి. అయితే ఆశయాలు, ఆకాంక్షలు ఒకటైనా, అవసరాలు వేర్వేరుగా ఉండటం సమస్య. ప్రజలు వారి అవసరాల కోసం ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తారు. అందువల్ల రాష్ర్టాల మీద ఆర్థిక ఒత్తిడి ఎక్కువ ఉం టుంది. దీన్ని అర్థం చేసుకోవడం లో కేంద్రం ఉదాసీనంగా ఉం టుందని నిపుణుల అభిప్రాయం. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఢిల్లీ మీద ధ్వజమెత్తినవారు, ఢిల్లీలో రాజ్యమేలుతున్నప్పుడు రాష్ర్టా ల ఆశలను, అవసరాలను, ఆశయాలను, ఆకాంక్షలను సహనం, సుహృద్భావం, సహృదయంతో చూడాలి కదా! కానీ అలా జరుగుతున్నదా? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులవడం మన వ్యవస్థలో ఎప్పటినుంచో ఉన్నది. అటువంటివారు ఏటికి ఈ వైపున ఉన్నప్పుడో మాట, అవతలివైపు చేరాక మరో మాట మాట్లాడటం మన వ్యవస్థలో ఉన్న అసలు సమస్య.
రాజ్యాంగంలో ‘సమాఖ్య’ అన్న పదం వాడకపోవటానికి కూడా నాడు బలమైన కారణాలున్నాయి. భిన్నత్వం బలీయంగా ఉన్న పరిస్థితుల్లో భిన్నత్వానికి భంగం కలగకుండా ఏకత్వం బలపడవలసిన అవసరాన్ని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. దేశంలో సంక్షోభం గానీ, అత్యవసర పరిస్థితి కానీ తలెత్తినప్పుడు ప్రజల విధేయత కేంద్రానికే ఉండాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ ఉద్ఘాటించారు. ఇది అసాధారణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్న మాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువన్న తరతమ బేధాల్లేకుండా ఒక తాటిమీద నడిచి జాతీయతా భావాన్ని పెంపొందించి, ఆర్థిక, సామాజిక, అభివృద్ధిని సాధించి ప్రపంచదేశాల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకోవాలనేది రాజ్యాంగ నిర్మాతల అంతర్యానం. కానీ నేడు జరుగుతున్న సంకుచిత రాజకీయాల తీరు తెన్నులమీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తున్నది!
ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఢిల్లీ మీద ధ్వజమెత్తినవారు, ఢిల్లీలో రాజ్యమేలుతున్నప్పుడు రాష్ర్టాల ఆశలను, అవసరాలను, ఆశయాలను, ఆకాంక్షలను సహనం, సుహృద్భావం, సహృదయంతో చూడాలి కదా! కానీ అలా జరుగుతున్నదా?
మిగతా రేపు…
(వ్యాసకర్త: రిటైర్డ్ డైరెక్టర్, లోక్‌సభ సచివాలయం, ఢిల్లీ)
- గుమ్మడిదల రంగారావు
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- constitution
- India
- states
- Union
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

