దేశ ప్రజలందరికీ దక్కాల్సిన జాతీయ సంపదను రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ అధికారుల సహాయంతో కొద్దిమంది చేజిక్కుంచుకోవడంతో కోట్లాది కార్మికులు, ఉద్యోగుల కష్టానికి తగిన ఫలితం అందడం లేదు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. ఈ దోపిడీని ఆపాలంటే కేంద్రంలో దేశ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ పాలన ఉండటం అవసరం. అలాంటి పాలనకు హామీ ఇస్తున్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దేశ ప్రజలంతా మద్దతు ప్రకటించి అండగా ఉండాలి.
మన కండ్ల ముందే లక్షలాది కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను అతి కొద్ది మంది దోచుకోవడాన్ని ఆపగలిగితే దేశ ప్రజల జీవన ప్రమాణాలు, దేశ జీడీపీ గణనీయంగా పెరుగుతాయి. మనం కలలు కంటున్న బంగారు భారతదేశం సాకారమవుతుంది. ప్రపంచంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటి కన్నా వేగంగా అభివృద్ధి చెందే అవకాశమున్నా మన దేశ సంపదను కొందరు పంది కొక్కుల్లాగా దోచుకుంటూ ఉండటంతో దేశప్రగతి కుంటు పడింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 8 ఏండ్ల కాలంలో మన బ్యాం కులు బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు రుణంగా ఇచ్చిన పది లక్షల కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయలేమంటూ రుణ మాఫీ చేశాయి. దేశ ప్రగతికి ఉపయోగపడాల్సిన ఆ డబ్బును కొంతమంది స్వార్థపరులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై దోచుకుం టూ ఉంటే కేంద్ర ప్రభుత్వ నిజాయితీని శంకించాల్సి వస్తున్నది. ఏ తాకట్టు హామీ లేకుండా వేలాది కోట్ల రూపాయ లు అప్పు ఇచ్చిన బ్యాంకుల అధికారులను గానీ, అప్పు ఎగవేసిన బాకీదారులను గానీ కేంద్ర ప్రభుత్వం శిక్షించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఏటా ఇంత పెద్ద యెత్తున ఆర్థిక దోపిడీ జరుగుతుంటే మన జాతీయ నిఘా వ్యవస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? వాటి స్వయం ప్రతిపత్తిని శంకించాల్సి వస్తున్నది.
మన బ్యాంకులు సరైన నిబంధనలు పాటించకుండా, తగిన హామీ లేకుండాఇచ్చిన కోట్లాది రూపాయల అప్పులను ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నిరర్థక ఆస్తులుగా ప్రకటిస్తూ పోతుంటే, జాతీయ సంపదను కాపాడటానికి, ఎగవేతదారులను శిక్షించడానికి, రుణాల వసూలుకు, రుణ మాఫీ చేసిన బాకీల వసూలుకు సంబంధించి సుప్రీం కోర్టు కూడా స్వచ్ఛందం గా కేసు నమోదు చేసి ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. ఈ ఉపద్రవంపై దేశ ప్రజలందరూ ఆందోళన చేపట్టాలి. మేధావులు, ఆర్థిక వేత్తలు కార్పొరేట్లకు రుణ మాఫీ చేయొద్దని రిజర్వ్ బ్యాంక్పైన, కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బడా పారిశ్రామి క వేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయల రుణ మాఫీ చేయడాన్ని చాలా సందర్భాల్లో విమర్శించా రు. ఆయన సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే బ్యాంకులు ఏటా ప్రకటిస్తున్న లక్షలాది కోట్ల రూపాయల నిరర్థక ఆస్తుల ప్రకటనకు ముగింపు పలుకుతుంది.
గత 8 ఏండ్ల కాలంలో దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే ఒక్క ప్రభుత్వ సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేయలేదు. కానీ లక్షలాది కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను తమకు కావాల్సిన బడా వ్యాపారులకు, కంపెనీలకు అతి తక్కువ ధరకు కట్టబెడుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. కేసీఆర్కు తోడుగా దేశ ప్రజలంతా ఈ విషయాన్ని వ్యతిరేకించాలి. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామిక వేత్తలు దోచుకోకుండా ఆపాలంటే కేంద్రంలో దేశ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ పాలన ఉండటం అవసరం. అలాంటి పాలనకు హామీ ఇస్తు న్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి దేశ ప్రజలంతా మద్దతు ప్రకటించి అండగా ఉండాలి. కేసీఆర్ నాయకత్వం లో బంగారు భారత దేశాన్ని నిర్మించుకోవాలి.
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ రైతు రక్షణ సమితి)
పాకాల శ్రీహరిరావు: 93475 80252