నిరతము ఠీవితోడ భువినేలెడు రాజులకన్న, నిత్యసం
గరమటు కొల్వు జేయు యధికారులకన్నను, వైరిసేనలన్
నరికి మహాపురస్కృతుల నందెడు యోధులకన్న శ్రేష్ఠుడీ
యరకను బట్టి దున్ను మన
హాలికుడీతని ముందు మ్రొక్కెదన్
పచ్చపచ్చని చేలు పసిడిచాయ కురిసె
వసుధ దేహము మీది వలువలనగ
వెచ్చవెచ్చని కాంతి విస్తరించి కురిసె
జనుల మోముల మీది తనివి యనగ
చల్లచల్లని నీరు వెల్లువై యుప్పొంగె
తల్లినేలకు బోయు తానమనగ
తియ్యతియ్యని పాలు దివ్యనదిగ పారె
పల్లెసీమలలోని ప్రగతి యనగ
ఇట్టి సాఫల్యమును బొందినట్టి వేళ
రైతుకోటిని యెంచెద రత్నములుగ;
కర్షకాళికి నిరతమ్ము హర్షమొసగు
పథకముండగ సంక్షేమ పథము వెలసె!
సమీహ, 98669 45424