జవహర్నగర్, సెప్టెంబర్ 12: రాయదుర్గం వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పోరాడుదామని, ప్రభుత్వం వక్ఫ్ భూములను అమ్ముకోవాలని చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్టూ జాతీయ కన్వీనర్ షేక్షావలి తెలిపారు. వక్ఫ్ బచావో తహ్రీక్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహిం చే ధర్నాకు తాము సంపూర్ణ మద్ద తు తెలుపుతున్నామని ప్రకటించారు.
వక్ఫ్ భూముల వేలం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిప్రజాస్వామికంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ముస్లిం మైనార్టీల విద్య, ఉపాధి,ఇతర సామాజికవర్గాల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రాజకీయాలకతీతంగా భూముల పరిరక్షణకు ఐకమత్యంతో పోరాడాలని సూచించారు. ఇందిరా పార్కు వద్ద ఆదివారం నిర్వహించే ధర్నాను విజయవంతం చే యాలని ఆయన అన్ని పార్టీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.